ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్నేహపూరి కాలనీలోని FPO ప్రతినిధి శ్రీధర్ రైతులు సేంద్రీయ పద్ధతిలో పండించిన వివిధ రకాల బియ్యం, పప్పులు, ధనియాలు వివిధ రకాలైనటువంటి చిరుధాన్యాలు రైతుల వద్ద నుండి సేకరించి తన షాపులో అందుబాటులో ఉంచుతున్నారు. ఈ సందర్భంగా జిల్లా సహకార అధికారిని వసంత మరియు అడ్లూరు ఎల్లారెడ్డి విండో చైర్మన్ మర్రి సదాశివరెడ్డి కలిసి షాపును సందర్శించారు ఈ సంధర్భంగా మాట్లాడుతూ రైతులు పండించే పంటలకు రసాయనాలు తగ్గించి సేంద్రియ వ్యవసాయం దిశగా మళ్లీ కలుషితం లేనటువంటి ఆహార ధాన్యాలను పండించినట్టయితే సహకార సంఘాల ద్వారా ఈ విధంగా మండల, పట్టణ కేంద్రాలలో షాపులను ఏర్పాటు చేసుకొని ప్రజలకు అందుబాటులో ఉంచేట్టయితే మంచి ధరలకు అమ్ముకోవచ్చని తెలిపారు. ఈ విధంగా చేసినట్టయితే మూడు విధాల లాభాలు ఉంటాయని రైతు యొక్క భూమి సారాంతమయితుందని, రైతుకు మంచి గిట్టుబాటు ధర లభిస్తుందని, రైతు తను పండించినటువంటి కల్తీ లేని ఆహారాన్ని తిన్నట్లయితే తన కుటుంబ ఆరోగ్యంగా ఉంటుందని అంతేకాకుండా కొనుక్కొని తిన్న ప్రజలకు ఆరోగ్యం కూడా బాగుంటుంది అని అన్నారు. కాబట్టి రైతుకు దనం తో బాటు పుణ్యం కూడా లభిస్తుందని తెలిపారు.