సెలవులు రద్దు చేస్తూ ప్రకటన
నమస్తే ఇందూర్ వార్త/ సంగారెడ్డి జిల్లా/ ఆగస్టు 14.
తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో వైద్య సిబ్బందికి 3 రోజులపాటు ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది. రానున్న మూడ్రోజుల పాటు ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. సూపరింటెండెంట్లు, RMOలు, వైద్యాధికారులు, వైద్యులు, సిబ్బంది కచ్చితంగా ఆస్పత్రిలోనే ఉండాలని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు, గర్భిణులకు తక్షణమే వైద్య సేవలు అందించాలన్నారు.