సావిత్రిబాయి పూలే స్పూర్తితో సమ సమాజాన్ని నిర్మిద్దాం.
రాష్ట్ర కార్యదర్శి జీవియం విఠల్
భారతీయ విద్యార్థి మోర్చా ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతిని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించరూ
ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి జీవీఎం విట్టల్ మాట్లాడుతూ సమాజంలో మహిళ విముక్తి విద్యతోనే ముడిపడి ఉందని గ్రహించి అసమానతలను రూపుమాపాలని కులం మతం భేదం లేకుండా అందరికీ విద్యను అందించాలని అగ్రకుల ఆధిపత్యం దాడులు చేసిన వెనకడుగు వేయకుండా మహిళ ఆభ్యుదయకోసం కృషి చేసిన మహనీయురాలు సావిత్రి పూలే అన్నారు.మహిళల హక్కుల కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తన న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. మహిళలు అన్ని రంగాలలో ముందుకు రావాలని విద్య , వైద్యం, ఉపాధి, పారిశ్రామికంగా, రాజకీయంగా ఎదిగే విధంగా నేటి సమాజం ప్రోత్సహించాలన్నారు.ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతిని ప్రకటించాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ కిష్టయ్య గారు మరియు అధ్యాపకులు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే ఫాతిమా షేక్ లాంటి మహనీయులు కృషి ఫలితంగా దేశంలో అందరికీ విద్యను అందుతుంది అని మహనీయుల ఆలోచన విధానాన్ని కొనసాగించాలని అన్నారు. మహిళలు మహానీయుల స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. మహిళలపై దాడులు అరికట్టాలని వారి యొక్క జీవిత చరిత్రలను చదివి సమాజానికి తెలియజేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శి ప్రసన్నకుమార్,బులెట్ ప్రభకర్ , యశ్వంత్ కళాశాల అధ్యాపకులు శంకర్, చంద్రకాంత్, రాజ్ కుమార్, రామస్వామి, మహిళా ఆధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.