–కేంద్ర ప్రభుత్వం సర్పంచుల ఖాతాల్లో జమ చేసిన డబ్బును రాత్రికి రాత్రి మాయం చేసిన వారు మేమే అభివృద్ది చేస్తున్నాం అనడం సిగ్గు చేటు
— ప్రజా గోస – బీజేపీ భరోసా స్ట్రీట్ కార్నర్ సమావేశాలు
ఇందూర్ వార్త : కామారెడ్డి
— గ్రామాల్లో జరిగే ప్రతి అభివృద్ధి పని కేంద్రం నిధులతోనే
దొరల కబంధ హస్తాల నుండి మిముక్తి పొంది తెలంగాణలో డబల్ ఇంజన్ సర్కార్ వస్తుంది
బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిన్నటి నుండి ప్రారంభం అయిన ప్రజా గోస – బీజేపీ భరోసా స్ట్రీట్ కార్నర్ సమావేశాలలో కామారెడ్డి మండలంలోని నర్సన్నపల్లి, చిన్నమల్లారెడ్డి, కొటాల్ పల్లి, లింగాయ పల్లి, తిమ్మక్ పల్లి, క్యాసం పల్లి, ఉగ్రవాయి గ్రామాల్లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లీ వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని అప్పు చేస్తే గానీ నెల గడిచే పరిస్థితి లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సర్పంచుల ఖాతాల్లో 14 వ ఆర్థిక సంఘం కింద గ్రామాల అభివృద్ది కోసం జమ చేసిన డబ్బును రాత్రికి రాత్రి మాయం చేసిన వారు మేమే అభివృద్ది చేస్తున్నాం అనడం సిగ్గు చేటు అని అన్నారు. బంగారు తెలంగాణలో సర్పంచ్ ల ఆత్మ హత్యలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. గ్రామాల్లో జరిగే ప్రతి అభివృద్ధి పని కేంద్రం నిధులతోనే జరుగుతుందనీ ఈ విషయంలో ఎక్కడికైనా చర్చకు సిద్దం అని అన్నారు. అన్నింటిలో విఫలమైన కెసిఆర్ ప్రభుత్వం అన్నిట్లో విఫలం అయ్యిందని అన్నారు.దొరల కబంధ హస్తాల నుండి మిముక్తి పొంది తెలంగాణలో డబల్ ఇంజన్ సర్కార్ వస్తుందనీ జోస్యం చెప్పారు.