అధికారుల పర్యవేక్షణ కరువైన సఖి కేంద్రం
అధికారుల అండతోనే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా నిర్వాహకులు
ఇందూర్ వార్త : కామారెడ్డి జిల్లా ప్రతినిది, అక్టోబరు 05
కామారెడ్డి, ఆపదలో ఉన్న మహిళలను అన్నివిధాలా ఆదుకొని, గృహహింస వేధింపులు, దాడులకు గురైన మహిళలకు తక్షణ వైద్య సదుపాయంతో పాటు న్యాయ, ఆర్థిక సాయం అందించే దిశగా సఖి కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతో కొనసాగే ఈ సఖి కేంద్రాలను తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం 2017 లో ప్రారంభించింది. నాటి నుండి కొన్ని ప్రభుత్వ ఆధీనంలో నడువగ మరికొన్ని ఎన్జీఓల పేరుతో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో సఖినిర్వహణ కొనసాగుతుంది. కామారెడ్డి సఖి సెంటర్ ఏప్రిల్ 2019 న ప్రారంభించారు. ప్రారంభంలో సఖి నిర్వహణ అంత ప్రైవేట్ ఎన్జీఓ చేతిలోనే ఉండి అద్దె భవనంలో నిర్వహించేవారు. గతంలోనూ సఖికేంద్రంలో పలు అక్రమాలు జరిగి, అప్పటి డీడబ్లుఓ సైతం పలు విమర్శలు ఎదుర్కొన్నారు. సెప్టెంబర్ 06 2023 రోజున పద్మపాని ఎన్జీవో బాధ్యతలను చేపట్టి ఏడాది గడిచినా సమస్యలు మాత్రం తీరడం లేదు.ఒక వైపు సీసీ కెమెరాలు పనిచేయక పోవడం నిత్యం పలు సమస్యలతో వచ్చే మహిళలు ఇక్కడనే ఒక రెండు రోజులు ఉండే విధంగా ఏర్పాట్లు ఉన్నపటికీ వారికి ఇవ్వలసిన వెల్ కమ్ కిట్ లో సుమారుగా 22 రకాల వస్తువులను అందించాలి కాని ఇక్కడ మాత్రం నాలుగు వస్తువులతో సరిపెడుతున్నారు.ఇదంతా అధికారులు చూసి చూడనట్లుగా ఉండడం వెనుకాల ఉన్న ఆంతర్యం ఏమిటో అని చర్చ జరుగుతున్నది. సరి అయిన సెక్యూరిటీ, నీటి సదుపాయం పూర్తిగా లేకపోవడంతో వాళ్ళు తిరిగి వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి. కనీసం కేంద్రాన్ని శుభ్రం చేసేందుకు క్లీనింగ్ స్టాఫ్ సైతం ఉన్న శుభ్రం చేయకపోవడం సిబ్బందే క్లీన్ చేసుకొని ఉంటున్నారని సమాచారం వాటితో పాటు డ్రైనేజీ సమస్య పెద్ద ఎత్తున ఏర్పడి వాసన వస్తుంది. చాలా సమస్యలు సఖి కేంద్రంలో ఉన్నాయని పలుసార్లు డిడబ్లుఓకి విన్నవించినప్పటికీ అయిన సమస్యల విషయంలో పట్టి పట్టనట్టు ఉంటున్నారని సమాచారం. ప్రస్తుతానికి కామారెడ్డి సఖి కేంద్రం నిర్వహణ మాత్రం అధికారులు, ఎన్జీఓలు కలిసి గాలికి వదిలేసినట్లు తెలుస్తుంది.సఖి సెంటర్ నిర్వహణ ఎన్జ్ఓ కి సంబంధించి నోటిఫికేషన్ వేయాలని గత రెండు నెలల క్రితం రాష్ట్ర కార్యాలయం నుండి లేక అధికారులకు వచ్చినట్టు సమాచారం. అయినప్పటికీ సఖి కేంద్రం నిర్వహ నోటిఫికేషన్ గోప్యంగా ఉంచడం వెనుకాల ఉన్న ఆంతర్యం ఏమిటి అని పలు అనుమానాలకు తవుతిస్తుంది.
అధికారులు సఖి సెంటర్ ఆకస్మిక తనిఖీలు చేసే సమయంలో ముందే ఎన్జీఓ వారికి తనిఖీలు చేయడానికి వస్తున్నాం అని ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళడం విడ్డూరం ఆకస్మిక తనిఖీ అంటేనే ఎవరికి తెలియకుండా చేయాల్సిన తనిఖీలు అయినప్పటికీ అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు.