- శివ శక్తుల గిరిజన పూజారుల గురించి భారత ప్రధాని కి లేఖ.
ఇందూరు వార్త డిసెంబర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
విశ్వ హిందూ మహాసంఘ్ ఆధ్వర్యంలో హిందూ సంస్కృతిని మరియు గుడులను కాపాడుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న శివ శక్తుల గిరిజన పూజారులకు దీప దూప నైవేద్యం పథకం ద్వారా 10,000/- రూపాయల నెలసరి వేతనాన్ని అందించాలి అని, అదే విధంగా గుడులకు మౌలిక వసతులు కల్పించాలని తెలంగాణ ఎండోమెంట్ డిపార్ట్మెంట్, జాతీయ ఎస్టీ కమిషన్, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ కి లేఖలు రాసిన స్పందించడం లేదని…..
గౌరవ భారత దేశ ప్రధాని *శ్రీ నరేంద్ర మోడీ* గారికి ఈరోజు మెయిల్ ద్వారా లేఖను పంపడం జరిగింది.
ఈ విషయంలో సహకరించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు *శ్రీ యోగి ఆదిత్యనాథ్* గారు, భారతీయ సర్వ సమాజ్ మహాసంఘ్ జాతీయ అధ్యక్షులు మరియు మాజీ భారత ప్రభుత్వ సలహాదారు, మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ *శ్రీ రామ్ కుమార్ వాలియా* గారు, విశ్వహిందూ మహాసంఘ్ జాతీయ కోఆర్డినేటర్ *మహంత్ ముకేష్ నాథ్* గారు, లక్ష్మి ఠాకూర్, మహివీర్ కొరవి, రమేష్ ఖేతన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
*మద్దిశెట్టి స్వామి,*
*విశ్వహిందూ మహాసంఘ్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు కోఆర్డినేటర్,*
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్.*