రోగుల సేవలో తరిస్తున్న వైద్యులు
•ఆపద కాలంలో రోగుల పాలిట ఆపద్బాంధవులు
• ప్రభుత్వ రంగంలో మెరుగైన వైద్యసేవల్లో ముందడుగు
ఇందూర్ వార్త : డెస్క్
ప్రాణం పోసేది బ్రహ్మ అయితే పునర్జన్మ ఇచ్చేది వైద్యుడు. అందుకే వైద్యో నారాయణో హరి అని అన్నారు పెద్దలు. ప్రతి ఒక్కరూ వైద్యుడిలో దేవుడిని చూస్తారు. ఎంత గొప్ప వ్యక్తి అయినా.. పేదవాళ్లు అయినా చేతులెత్తి నమస్కరించేది వైద్యులకు మాత్రమే. ప్రాణపాయ స్థితిలో ఉన్నా.. ప్రమాదంలో గాయపడినా.. ఎలాంటి ఆపద వచ్చినా గుర్తుకు వచ్చేది వైద్యులే. వారి ఆత్మీయ స్పర్శ రోగికి అపర సంజీవని. ప్రస్తుత పరిస్థితులలో ఆహారం, వాతా వరణంలో వస్తున్న మార్పుల కారణంగా కొత్త కొత్త రోగాలు వస్తు న్నాయి. రోజూ వేల మంది రోగులకు వైద్యులు వివిధ రకాల చికిత్సలు అందిస్తున్నారు. రోగుల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా సేవలు అందిస్తున్నారు ఎంతో మంది అభ్యాగులకు వైద్యులు మానవత్వంతో సేవలందిస్తూ.. అందరి మన్ననలు పొందుతున్నారు. సోమవారం జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం.