భారతదేశాన్ని విశ్వగురువు గా నిలపడమే నరేంద్ర మోదీ గారి లక్ష్యం
కరోనా ను సమర్థవంతంగా ఎదుర్కొన్నది భారత్ మాత్రమే
తెలంగాణ ప్రజలందరూ కల్వకుంట్ల కుటుంబ సభ్యులు అయితే రైతు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నట్టు
బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కామారెడ్డి నియోజకవర్గంలో రాజంపేట మండలములోని పోందుర్థి, తలమడ్ల, ఆరేపల్లి, శివాయి పల్లి, తో పాటు రాజంపేట మండల కేంద్రంలో స్ట్రీట్ కార్నర్ సమావేశాలు శక్తి కేంద్ర ఇంఛార్జి ల అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ కేంద్రములో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత భారతదేశము అన్ని రంగాల్లో ముందుకు పోతుందని, భారత దేశాన్ని విశ్వగురువు గా నిలపడమే నరేంద్ర మోదీ గారి లక్ష్యమని అన్నారు. కరోనా సమయంలో ప్రపంచం అంతా అతలాకుతలం అయినా సమర్థవంతంగా ఎదుర్కొన్నది మాత్రం భారత్ మాత్రమే అని అన్నారు. కరోనా టీకాను 12 ఏళ్ల నుండి మొదలుకొని అందరికీ ఉచితంగా ఇచ్చిన ఘనత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిది అని అన్నారు. ఒక వైపు కేంద్రంలో సమర్థవంతమైన బీజేపి ప్రభుత్వం నడుస్తుంటే తెలంగాణ కల్వకుంట్ల కుటుంబ పాలన నడుస్తుందని అన్నారు. మొన్న అసెంబ్లీలో కుటుంబ పాలన గురించి మాట్లాడిన గౌరవ మంత్రి KTR గారు తెలంగాణ ప్రజలందరూ తన కుటుంబ సభ్యులే అని అన్నారని తెలంగాణ ప్రజలందరూ కల్వకుంట్ల కుటుంబ సభ్యులు అయితే రైతు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నట్టు అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చనీ ర్ష్కి క్స్ దేేశానికిి ని ర్ఎస్ గా మారి ప్రజలను మద్యపెడుతుందని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగిన బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు.