విద్యకు మరియు హాస్టల్ వసతి భోజన సదుపాయాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది
ఇందూర్ వార్త ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి డిసెంబర్ 14
ఎస్ టి హాస్టల్ లో సహాపంక్తి భోజనం లో పాల్గొన్న… డాక్టర్ మట్టా దయానంద్ సత్తుపల్లి పట్టణం – JVR డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో లో ఎస్ టి హాస్టల్ విద్యార్థినిలు తో కలిసి” సహాపంక్తి ” భోజనం చేసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ . మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్య మంత్రివర్యులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యకు మరియు హాస్టల్ వసతి, భోజన సదుపాయాలకు పెద్ద పీఠ వేస్తుంది అని విద్యార్థిని, విద్యార్థులు మంచి చదువుకొని భవిష్యత్ లో ఉన్నత స్థాయిలో ఉండాలి అని తెలిపారు…. సత్తుపల్లి నియోజకవర్గం లో అన్ని హాస్టల్స్ ను, స్కూల్స్ ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాము అని తెలిపారు.. కాంట్రాక్టర్ లు హాస్టల్స్ లో నాణ్యత, శుభ్రమైన, పోషక భోజనం అందించాలి అని తెలియజేసారు..ఈ కార్యక్రమం లో సత్తుపల్లి ఏ ఎం సి చైర్మన్ దోమ ఆనంద్, సత్తుపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ తోట సుజాల రాణి, పట్టణ కౌన్సిలర్స్, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, కాంగ్రెస్ నాయకులు కమల్ పాషా మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు..