ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
Telangana: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికిలోని నల్లపోచమ్మ ఆలయం జాతరకు ప్రతి ఏటా ముస్తాబవుతుంది. ఏటా హోలీ పండగ తర్వాత మూడో రోజు నుంచి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా.
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని తునికి గ్రామంలో ఆ గ్రామ శివారులో నల్లపోచమ్మ తల్లి ఆలయం ఏర్పడింది దినదినా భక్తులు అమ్మవారిని దర్శించుకొని కోరికలు తీరుస్తూ భక్తుల కొంగుబంగారంగా నిలిచిన నల్లపోచమ్మ తల్లిగా వెలిసి భక్తులకు కొంగుబంగారంగాను నిలిచింది ఈ పుణ్యక్షేత్రాన్ని జాతర సమయంలో దర్శించుకోవడానికి స్థానికులే కాకుండా ఇతర జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ప్రతి ఏటా జరిగే జాతరకు ఏర్పాట్లు దగ్గర ఉండి చూసుకుంటారు నాలుగు రోజుల పాటు జాతర కొనసాగనుంది.
వందేళ్ల చరిత్ర కలిగిన టెంపుల్
ఈ ఆలయాన్ని వందేళ్ల కిందట నిర్మించినట్లు చరిత్ర ఉంది. తునికి గ్రామానికి చెందిన ముచ్చర్ల లింగారెడ్డి అనే భక్తుడికి గ్రామ శివారులోని పురాతన శివాలయం వద్ద అమ్మవారి విగ్రహం కనిపించగా విషయాన్ని గ్రామ పెద్దలకు చెప్పారు. దీంతో అందరు కలిసి అమ్మవారి మను ఎడ్లబండిపై గ్రామంలోకి తీసుకొస్తుండగా కొద్దిదూరం వచ్చి గెగ్గ ఇప్పచెట్టు వద్ద ఆగిపోయిందట. అక్కడే విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయడం మొదలు పెట్టారు. ఇదే గ్రామానికి చెందిన నాయబాబ్, మాచర్ల బొంతయ్య, లింగారెడ్డి జాతర నిర్వహణకు శ్రీకారం చుట్టారు. అదే సంప్రదాయంగా మారింది