రైతులకు నువ్వుల విత్తనాల సరఫరా
*రైతులకు నువ్వుల విత్తనాల సరఫరా*
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూరు వారి ద్వారా ఎస్సీ సబ్ ప్లాన్ కింద ఉచిత నువ్వుల విత్తనాలు సరఫరా చేశారు. 11 మంది ఎస్సీ రైతులకు ఒక్కొక్కరికి ఒక ఎకరానికి మూడు కిలోల చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ మర్రి సదాశివరెడ్డి మాట్లాడుతూ.. ఉచితంగా ఇచ్చిన విత్తనాలను రైతులు విత్తుకొని తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడి పొందాలని కోరారు. ప్రస్తుతం నూనె గింజల సాగు తక్కువ ఖర్చుతో లాభదాయకంగా ఉందని రైతులు కేవలం వరి మాత్రమే కాకుండా నూనె గింజలు కూడా పండించినట్టయితే ఆర్థికంగా లాభపడతారని తెలిపారు. ప్రోగ్రాం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త నవీన్ మాట్లాడుతూ.. నువ్వులను జనవరి మరియు ఫిబ్రవరి నెలలో విత్తుకున్నట్టయితే ఎటువంటి చీడపీడలకు గురి కాకుండా పంట ఏపుగా పెరిగి సుమారు ఐదు నుంచి ఆరు క్వింటాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ముందుగా విత్తన శుద్ధి చేసి కార్బన్డిజం మరియు మ్యాంగోజెబ్ మధ్యలో పిచికారి చేసుకున్నట్లయితే పంటకు తెగులు నుంచి రక్షించుకోవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ బక్కన గారి భాస్కర్, వార్డ్ మెంబర్ అశోక్, సొసైటీ సీఈఓ బైరయ్య, ఏఈఓ శ్రీనివాస్ రెడ్డి, రైతులు శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.