-
రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించిన ప్రధాని
-
రేవంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
-
ఈ ఏడాది రేవంత్ రెడ్డికి అద్భుతంగా సాగాలని ఆకాంక్షించిన చిరు
వెబ్ డెస్క్ ఇందూర్ NOV 09
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రధాని ఆకాంక్షించారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు. “తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన దీర్ఘకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మోదీ బర్త్‌డే విషెస్‌పై స్పందించిన రేవంత్ రెడ్డి.. “హృదయపూర్వక శుభాకాంక్షలకు కృతజ్ఞతలు” అని రీట్వీట్ చేశారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా సీఎం రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది రేవంత్ రెడ్డికి అద్భుతంగా సాగాలని, ఆయన దీర్ఘాయుష్షుతో పాటు మంచి ఆరోగ్యంతో ఉండాలని చిరంజీవి ఆకాంక్షించారు.”గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు! ఈ ఏడాది మీకు అద్భుతంగా ఉండాలి. ప్రజల సేవలో మీరు విజయవంతం కావాలి. మంచి ఆరోగ్యంతో దీర్ఘాయుష్షు పొందాలని కోరుకుంటున్నాను!” అని చిరు ట్వీట్ చేశారు.కాగా, సీఎం రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మహబూబ్‌నగర్‌లోని కొండారెడ్డి పల్లిలో జన్మించారు. శుక్రవారంతో ఆయనకు 55 ఏళ్లు. ఇక రేవంత్ రెడ్డి 2023 డిసెంబర్ 7న తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యునిగా పనిచేశారు.