రేపు పూసుకుంటలో మంత్రి తుమ్మల పర్యటన
ఇందూరు వార్త ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి డిసెంబర్ 13
రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు దమ్మపేట మండలం పరిధిలోని పూసుకుంట గ్రామంలో స్ధానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలసి పర్యటిస్తారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే పర్యటనలో భద్రాద్రి జిల్లా అధికారులు పాల్గొంటారు.. పూర్తి గిరిజన గ్రామమైన పూసుకుంట అభివృద్ధిపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం దమ్మపేట మండలంలో ఏకలవ్య పాఠశాలలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొంటారు.