రెండు రాష్ట్రాల మధ్య రహదారిని పట్టించుకోని అధికారులు- తంబళ్ల రవి
ఇందూర్ వార్త నవంబర్ 24
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
తెలంగాణ రాష్ట్రం అల్లిపల్లి గ్రామం…ఆంధ్ర రాష్ట్రం అల్లిపల్లి గ్రామం మధ్యలో ఉన్న రహదారి ఏ ప్రభుత్వం రోడ్డు పోస్తుందో అని ఎదురు చూస్తున్న ఇరు గ్రామాల ప్రజలు ఇరు రాష్ట్రాల రాకపోకలకు ఇదే ప్రధాన రహదారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం అల్లిపల్లి గ్రామం దగ్గర రెండు రాష్ట్రాల సరిహద్దు ఉంది,ఇరు రాష్ట్రాల రాకపోకలకు ఇదే ప్రధాన రహదారి,ఇ రహదారి వాహనదారులకు చాలా ఇబ్బందికరంగా మారింది,గత ప్రభుత్వాలు పట్టించుకోవడం వల్ల ఒక కిలో మీటరు రహదారి పూర్తిగా దెబ్బతిన్నది,కొత్తగా ఏర్పడిన ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాలు కూడా పట్టించుకోకపోవడం వల్ల సుమారు మోకాల్లోతు గుంటలు పడి ఉన్నవి నాలుగు చినుకులు వర్షం పడ్డ కూడా లోతు ఎంత ఉందో తెలవనంత దారుణంగా తయారైయున్నది,వాహనదారులు మరియు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు,ఏ ప్రభుత్వం పరిధిలో ఉన్నది అన్నది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలకే తెలవడం లేదు మరీ ఏ ప్రభుత్వం రోడ్డు పొస్తుందో అని ఎదురుచూస్తున్న ఇరు గ్రామాల ప్రజలు, అధికారులు పట్టించుకోని రోడ్డు ఏర్పాటు చేయాలని ఆదివాసీ నాయకులు తంబల్ల రవి డిమాండ్.