రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి కి వినతి పత్రం
ఇందూర్ వార్త డిసెంబర్ 3 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్
హాస్టల్ విద్యార్థుల సమస్యలపై వినతి పత్రం
కొత్తగూడెం డిసెంబర్ 3 ( ) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలపై ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్ లపై విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం పెంచిన మెస్ చార్జీలను విద్యార్థులకు నిజాయితీగా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి రిటైర్ ఐఏఎస్ ని మర్యాదపూర్వకంగా రామవరం లో కలిసి వినతి పత్రం అందించిన తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్ ఈ సందర్భంగా కోటా శివశంకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అన్ని తరగతుల విద్యార్థులకు మెస్ చార్జీలను కాస్మోటిక్ పెంచిందని పెంచిన మేస్ కాస్మోటిక్ చార్జీలను నిజాయితీగా విద్యార్థులకు అందించాలని సింగరేణి ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో కాలేజీ ఎటాచ్డ్ హాస్టల్ అనుమతులు తీసుకురావాలని రాష్ట్రవ్యాప్తంగా ఔట్సోర్సింగ్ వ్యవస్థని రద్దుచేసి ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఈఎస్ఐ పీఎఫ్ కట్టకుండా చాలా అవినీతి చేస్తున్నారని వీటన్నిటిపై పూర్తి విచారణ నిర్వహించి అందరికీ న్యాయం చేయాలని తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం కోట శివశంకర్ అన్ని విషయాలపై వివరంగా మాట్లాడుతూ వినతిపత్రాలు అందించడం జరిగింది వినతిపత్రాలు అందించిన వారిలో నాయకులు బత్తిని రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు