మండలంలోని వివిధ గ్రామాలలో ప్రజాగోస బిజెపి భరోసా స్ట్రీట్ కార్నర్ సమావేశాలు
ఇందూరు వార్త :
రాజంపేట, ఫిబ్రవరి 11,
బిజెపి రాష్ట్ర శాఖ పిలుపుమేరకు రాజంపేట మండలంలోని ఆరేపల్లి, తలమడ్ల, పొందుర్తి ,శివాయిపల్లి గ్రామాలలో ప్రజాగోస బిజెపి భరోసా కార్యక్రమంలో భాగంగా స్ట్రీట్ కార్నర్ సమావేశాలను నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో కామారెడ్డి బిజెపి అసెంబ్లీ ఇంచార్జ్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ మేనిఫెస్టోలో చెప్పిన పథకాలు అమలు చేయడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు, అంతేకాకుండా రైతులకు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు రైతుబంధు పథకాలలోని లోసుగులను ఎండగడుతూ ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు వివిధ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది