రాఘవపూర్ వద్ద శరవేగంగా రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు
ఇందూర్ వార్త : న్యూస్ ప్రతినిధి
పెద్దపల్లి జిల్లా నవంబర్13
పెద్దపల్లి జిల్లాలోని రాఘవాపూర్ వద్ద మంగళవారం రాత్రి గూడ్స్ రైలు బోల్తా పడింది ఐరన్ రాడ్ వేసుకొని ఓవర్ లోడ్ తో వెళుతున్న గూడ్స్ రైలు 11 డబ్బాలు బోల్తా పడ్డాయి,దీంతో రాఘవపూర్ సమీపంలో యుద్ధ ప్రాతిపదికన రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి, రాఘవపూర్,వద్ద జరుగుతున్న రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులను జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పరిశీలించారు.మంగళవారం రాత్రి ఇక్కడ గూడ్స్ రైలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. ఈ సమాచారం అందుకున్న కలెక్టర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని బుధవారం తెల్లారుజాము వరకు ఉండి పోలీసు సిబ్బంది తో కలిసి అవసరమైన చర్యలు చేపట్టినట్టు తెలిసింది,భారీ క్రేన్లుతో రైల్వే ట్రాక్ పై పడిపోయిన గూడ్స్ డబ్బాలనుసిబ్బంది తొలగిస్తున్నారు. తెగిపడ్డ విద్యుత్తు తీగలను పునరుద్దిస్తున్నారు.పట్టాలు తప్పిన గూడ్స్ రైలు డబ్బాలను క్లియర్ చేసే పనులు ప్రారంభించారు.రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులను దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ , పాటు పెద్దపెల్లి జిల్లా కలెక్టర్, కోయ శ్రీహర్ష కూడా దగ్గరుండి పనులను పర్యకిస్తున్నారు.పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.