*రక్తహీనతతో భాధపడుతున్న వ్యక్తి కీ రక్తదానం(O-)చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు*
*జిల్లా రక్తధాతల సేవా సమితి*
నిర్వాహకులు
*బోనగిరి శివకుమార్*
*ముదాం శ్రీధర్ పటేల్*
కామారెడ్డి ఫిబ్రవరి 25ఇందూర్ వార్త ప్రతినిధి
కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి లో కామారెడ్డి జిల్లా కృష్ణాజివాడి గ్రామానికి చెందిన *గడీల బుచ్చిరాజులు (65)* అనే పేషంట్ కీ చికిత్స నిమిత్తం అత్యవసరంగా అతీ తక్కువ మందిలో ఉండే *ఓ నెగెటివ్* రక్తం అవసరం కావడంతో వారి కుటుంబసభ్యులు *జిల్లా రక్తదాతల సేవా సమితి* నిర్వాహకులను సంప్రదించగా, కామారెడ్డి పట్టణానికి ప్రభుత్వ ఉపాధ్యాయులు, RSS పూర్వ కార్యకర్త *సతీష్ కుమార్* గారి సహకారంతో వారికి కావాల్సిన రక్తం ఇవ్వడం జరిగింది , ఒక్క ఫోన్ కాల్ చేయగానే వెంటనే
స్పందించి రక్తదానం కు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని, ఈ సందర్బంగా జిల్లా రక్తధాతల సేవా సమితి* నిర్వాహకులు బోనగిరి శివకుమార్, ముదాం శ్రీధర్ పటేల్* గార్లు రక్తదాతకు కృతజ్ఞతలు తెలిపారు.ఎవరికైనా ఎప్పుడైనా రక్తం అవసరం ఉంటే 9666620006,9848687025 నంబర్లను సంప్రదించగలరు అని తెలుపడం జరిగింది.ఈ కార్యక్రమంలో KBS బ్లడ్ బ్యాంక్ టెక్నీషియాన్ సంతోష్ ,పెషేంట్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు