రక్తదానం చేసిన ఏబీవీపీ నాయకులు – రోహిత్
— జిల్లా రక్తదాతల సేవా సమితి
–నిర్వాహకులు బోనగిరి శివకుమార్, ముదాం శ్రీధర్ పటేల్
ఇందూర్ వార్త : వెబ్ డెస్క్ శుక్రవారం నవంబర్ 01
కామారెడ్డి పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గణేష్ అనారోగ్యం నిమిత్తం అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో పేషంట్ కుటుంబసభ్యులు కామారెడ్డి జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులను సంప్రదించడంతో వెంటనే స్పందించిన ఏబీవీపీ కామారెడ్డి జిల్లా కన్వీనర్ రోహిత్ రక్త దానానికి ముందుకు వచ్చి అత్యవసర సమయంలో రక్త దానం చేయాలనే ఉద్దేశంతో వెంటనే వచ్చి ఓ పాజిటివ్ రక్తం అందించారు ఈ సందర్భంగా ఏబీవీపీ కామారెడ్డి జిల్లా కన్వీనర్ రోహిత్ మాట్లాడుతూ దేశసేవ నిమిత్తమై తాను ఎల్లప్పుడూ ఏబీవీపీ కార్యకర్తగా ముందుంటామని తెలియజేశారు.
ఈ సందర్భంగా సేవా సమితి నిర్వాహకులు మాట్లాడుతూ
రక్తం దానం చేస్తే మళ్లీ రక్తం వస్తుంది కానీ, రక్తం సమయానికి అందక ప్రాణాలు కోల్పోతే వారి ప్రాణం మళ్ళీ తిరిగి రాదనీ. మనం చేసే రక్తదానం వలన విలువైన ప్రాణాన్ని రక్షించబడుతమని అన్నారు.
యువత మానవత్వంతో స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు వచ్చి ప్రాణదాతలు కావాలని తెలియజేశారు. ఒక్క ఫోన్ కాల్ చేయగానే వచ్చి రక్తదానం చేసిన విద్యార్థి నాయకులు రోహిత్ కి జిల్లా రక్తధాతల సేవా సమితి నిర్వాహకులు బోనగిరి శివకుమార్, ముదాం శ్రీధర్ పటేల్ లు ధన్యవాదాలు తెలిపారు.