మొదటి బహుమతిని కైవసం చేసుకున్న ప్రభుత్వ పాఠశాల క్రీడా కారులు
విద్యార్థులు ఆటల పోటీల్లో చురుకుగా పాల్గొనాలి- పిఈటి సంతోష్, శ్రీహరి
గెలుపు ఓటమిలు విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించలేవు
ఆటల పోటీలను విద్యార్థులు స్నేహితుల కలయికగా భావించాలి- ప్రధానోపాధ్యాయులు గణా జ్యోతి రాణి
ఇందూర్ వార్త ప్రతినిది ధర్పల్లీ నవంబర్ 15
ధర్పల్లి మండల స్థాయి అంతర పాఠశాలల క్రీడోత్సవాలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి, విద్యాధికారి అశోక్ 12 వ తారీఖున జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ క్రీడా పోటీలకు ధర్పల్లి మండల గ్రామాల ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడా పోటీల్లో గెలుపు ఓటమి జీవిత విజయాన్ని నిర్ణయించలేవనే సూచికగా కొనసాగుతున్న, ప్రక్రియలో గెలుపు విజయానికి సంకేతం అయితే, ఓటమి ప్రయత్నించడానికి మరో మెట్టుగా విద్యార్ధి భవిష్యత్తును నిర్ణస్తుందని, ఆటల పోటీలు శారీరక దృఢత్వాన్ని విద్యార్థుల్లో పెంపోందిస్తుందని, విద్యార్థులు ఆటల పోటీల గెలుపు,ఓటమిలను కేవలం స్నేహితుల కలయికగా విద్యార్థులు భావించాలని ధర్పల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గణా జ్యోతి రాణి అన్నారు…అనంతరం ఆటల పోటీలను నిర్వహించిన యాజమాన్యం క్రీడా పోటిల్లో గెలుపొందిన విద్యార్థులకు అందజేశారు.ఈ కార్యక్రమంలోనే భాగంగానే ధర్పల్లి మండల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంతో చాకచక్యంగా కబడ్డీ పోటీలో దుబ్బాక ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులతో పోటీ పడి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నట్లు ధర్పల్లి మండల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఘనా జ్యోతి, పిఈటి సంతోష్, శ్రీహరి తెలిపారు. ఈ ఉత్సాహభరితమైన క్రీడోత్సవాలను ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో క్రీడా పోటీలను దుబ్బాక గ్రామ ప్రభుత్వ పాఠశాల యందు ఏర్పాటు చేసినట్లు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ విద్యాధికారి అశోక్, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి హాజరయ్యారు.
*గెలుపు ఎవరి సొత్తువ కాదు? గెలుపే మా బానిస!*
*గెలుపొందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల మాటల్లో….*
గెలుపు మాకు బానిస,కొన్నిసార్లు ఒకరి సంతోషం కోసం మా గెలుపుని వదులుకునే నైతిక విలువలు కలిగిన మనసులు మావి. ఆర్థికంగా మేము వెనుకబడిన వారిమే కాని ఆటల్లో,తెగింపులో వీరనారులం అమ్మ ఒడిలో ఆట బొమ్మలం దేశ రక్షణలో భారత సైనికులం. ఉద్యోగంలో,ఉన్నత చదువులో వెనుకబడినా నాన్నకు ఆసరాగా, అమ్మకు తోడుగా నిలబడతాం. రోడ్డుపై వెళ్తుంటే ప్రైవేట్ పాఠశాలలో ఆటవస్తువులను చూస్తూ కడుపు నింపుకుని రోడ్డుపై వస్తువులను ఆటవస్తువులుగా మలుచుకుంటాం. మా ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లో అయినా మేము అలసిపోము పచ్చని పొలాల్లో వన భోజనం, బోరుబావిలో నీటిని త్రాగుతాం. సద్దన్నంతో కడుపునింపుకుని కష్టాలను దిగమింగుతాం.అయినా మా ఆరోగ్యం మా చేతుల్లో. మా జీవితాలకు ఓనమాలు మా పాఠశాల చెట్లక్రిందనే, తరగతి గదుల్లో బంధికానివ్వం. మా ఆశయాలు చదువుకునే పుస్తకాలలో, చినిగిన చొక్కా వేసుకున్న మా ముఖ చిత్రాలు చరిత్రలో నిలుస్తాయి. ఇవే మా గెలుపుకు నాంది…….