మొకంపల్లిలో బీజేపీ పల్లెగోస -బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్
ఇందూర్ వార్త
10 ఫిబ్రవరి
నిజామాబాదు జిల్లా : నవీపేట్ మండల కేంద్రంలోని మొకంపల్లె గ్రామంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో
“పల్లెగోస – బీజేపీ భరోసా ” కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్బంగా బోధన్ సీనియర్ నాయకులు వట్టి మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజాఅభిప్రాయాలని , అభివృద్ధిని గాలికి వదిలేసిన తెలంగాణ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని ప్రజలని కోరారు , రానున్న రోజులలో బీజేపీ ప్రభుత్వని అధికారంలోకి వస్తే అన్ని రకాల వర్గాల వారికి అభ్యున్నతికి తోడ్పడ్తామని అయన తెలిపారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధాన్పాల్ సూర్య నారాయణ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్తకి బీజేపీ ప్రభుత్వం అండగా ఉంటున్నది అని తెలిపారు .ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రచ్చ సుదర్శన్ ,
జిల్లా కార్యదర్శి సుధాకర్ చారీ, సీనియర్ నాయకులు నర్సింహా రెడ్డి, అడ్లూర్ శ్రీనివాస్, అసెంబ్లీ కన్వినర్ శ్రీధర్, మండల అధ్యక్షులు సుక్క రాజు,మండల ప్రధాన కార్యదర్శి ఆనంద్, ప్రజా ప్రతినిధులు, సర్పంచ్ లు సరిన్, సుధాకర్, జిల్లా యువ మోర్చా ఉపాధ్యక్షులు పిల్లి శ్రీకాంత్,సొసైటీ డైరెక్టర్ లు మాజీ సర్పంచ్ లు,ఎంపీటీసీ రాధ,రచ్చ సుదర్శన్,శక్తి కేంద్ర ఇంచార్జి లు బూత్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, వివిధ మోర్చాలా అధ్యక్షులు కార్యకర్తలు ,యువకులు పాల్గొన్నారు .