ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
మెదక్ పట్టణ బంద్ కరపత్రం విడుదల
మెదక్ ఆత్మగౌరవానికి, హరీష్ రావు దొర పోకడలకు మధ్య సమరమే బంద్
పీసీసీ నేతలు సుప్రబాతరావు, మ్యాడం బాలక్రిష
మెడికల్ కళాశాల మంజూరులో మంత్రి హరీష్ రావు అబద్దపు హామీలకు నిరసనగా ఈ నెల 14 న నిర్వహించే మెదక్ పట్టణ బంద్ కరపత్రాన్ని కాంగ్రెస్ నేతలు మంగళవారం ఆవిష్కరించారు. పీసీసీ సభ్యులు చౌదరి సుప్రబాతరావు, మ్యాడం బాలక్రిష్ణ
కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి మెదక్ పట్టణ బంద్ ఆవశ్యకతను వివరిస్తూ కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి హరీష్ రావు పచ్చి అబద్దాలు చెబుతూ గడిచిన పదేళ్లుగా మెదక్ జిల్లా అభివృద్దిని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ నీళ్లు, నిధులు, కార్యాలయాలను సిద్దిపేటకు తరలించుకుపోయిన దొంగ మంత్రి హరీష్ రావు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట దొరల అహంకారానికి, మెదక్ ప్రజల ఆత్మగౌరవానికి జరిగే సమరమే ఈ నెల 14 న నిర్వహించే మెదక్ పట్టణ బంద్ అని వారు అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, హఫీజ్ మొల్సబ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాగిరెడ్డి, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ సల్మాన్, మెదక్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సంతాప్ప, వికలాంగుల జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్, కొండా సంజీవ్, పట్టణ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్ చౌదరి, శ్రీశైలం, జాకీర్, శంకరంపేట్ మండల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మాడూర్ నవీన్, బాలరాజ్ గౌడ్, కోటిరాజు, మధుసూదన్, రాజు, మధుతారక్, శాలిపేట రాజు అనిల్, రాజు, మహిపాల్, నవీన్, శ్రీకాంత్ నవీన్, బిక్షపతి, అర్జున్, ప్రభాకర్, గణేష్, అఫ్రోజ్, నవీన్, అమీర్ తదితరులు పాల్గొన్నారు.