- కనీస వసతులు లేని ప్రభుత్వ పాఠశాలలు
- రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్యార్థుల యొక్క భవిష్యత్తును మార్చాలని ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నో రకాల సదుపాయాలను ఏర్పాటు చేయాలనేదే ప్రభుత్వ ఆశయం
- కానీ ఏ ఒక్కటి కూడా అమలు కాకపోవడం గమనార్హం
- స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్ లేకపోవడం
- ఒక లైబ్రరీ లేకపోవడం
- కనీస క్రీడా మైదానం కూడా లేకపోవడం
- విద్యార్థులకు సైన్స్ ల్యాబ్ లేకపోవడం
- చాలీచాలని తరగతి గదులు
- విద్యార్థులు టాయిలెట్స్ కు ఇబ్బంది పడాల్సి వస్తుంది
మెదక్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో కనీస సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం జెడ్ పి హెచ్ ఎస్ హై స్కూల్ లో విద్యార్థులు చాలీచాలని తరగతి గదులలో విద్యను అభ్యసిస్తున్నారు మధ్యాహ్న భోజనం ఆరుబయట వండుతున్నారు చెట్ల కింద ఇలా ఒకే మండలంలో కాకుండా వివిధ మండలాలలో చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలి ఈ విషయంలో ఎవరు నిర్లక్ష్యం వహించిన వారిపైన వెంటనే తగు చర్యలు తీసుకోవాలి
పిల్లలందరికీ విద్యనందించడం మనందరి సామాజిక బాధ్యత. సమాజంలోని ప్రతి ఒక్కరూ చదువుకుంటేనే దేశం – అభివృద్ధి చెందుతుంది. తమ పిల్లలు బాగా చదువుకుని ఎదగాలని, ప్రయోజకులు కావాలని ప్రతి తల్లి, తండ్రి కోరుకుంటారు. అలాంటి తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు పాఠశాల విద్యాభివృద్ధిలో భాగస్వాములైతే ప్రాధమిక విద్య అన్ని విధాలుగా అభివృద్ధి చెందడమే గాక విద్యా ప్రమాణాలు మెరుగవుతాయి.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 45 ప్రకారం 6 – 14 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించవలసిన బాధ్యత ప్రభుత్వంతో పాటు మనందరిపైన ఉంది. అలాగే 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ప్రకారం ఆర్టికల్ 21 ఎ విద్యను ప్రాథమిక హక్కుగా పరిగణించాలని నిర్దేశించడమైనది. ఆర్టికల్ 51 ఎ ప్రకారం దేశంలోని ప్రతి తల్లి / తండ్రి లేదా సంరక్షకుడు తమ పిల్లలకు 6 నుండి 14 సంవత్సరాల వయస్సులోని వారందరికీ విద్యావకాశాలు కల్పించటం ప్రాథమిక విధిగా పేర్కొనబడినది. దీనిలో భాగంగానే 6 – 14 సంవత్సరాల వయస్సులోని బాలలందరికీ విద్యను అందించడానికి ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం, 2009 ని భారత ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ చట్టం ఏప్రిల్ ఒకటి 2010 నుండి భారతదేశమంతటా (జమ్ముకాశ్మీర్ మినహా) అమలులోకి వచ్చింది.
విద్యాహక్కు చట్టం అమలు ద్వారా పిల్లలందరికీ విద్యావకాశాలు కల్పించుటకు మరియు సార్వత్రిక ఎలిమెంటరీ విద్యా సాధన కోసం భారత ప్రభుత్వం సర్వ శిక్షా అభియాన్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తొంది. ఈ కార్యక్రమాల అమలుకు సహకరించి ఎలిమెంటరీ విద్యాసాధనకు మనవంతు కృషి చేద్దాం.
73వ రాజ్యాంగ సవరణ
73వ రాజ్యాంగ సవరణ ప్రకారం పాఠశాల విద్యాశాఖ నియంత్రణలో ఉన్న అన్ని పాఠశాలలకు చెందిన అంశములకు సంబంధించిన అధికారాలు, బాధ్యతలను పంచాయితీరాజ్ సంస్థలకు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 2 తేది 03.02.2008 ద్వారా బదలాయింపు చేయడం జరిగింది.
పంచాయితీరాజ్ సంస్థలను పునరుజ్జీవం మరియు బలోపేతం చేయడానికై ఈ చట్టం నిర్దేశింపబడినది. ఈ సవరణ పంచాయితీరాజ్ సంస్థలకు అధికారాలను, బాధ్యతలను బదలాయించే అవకాశం కల్పించింది. మరియు పంచాయితీలు సామాజిక న్యాయం, ఆర్థికాభివృద్ధి కొరకు, ప్రణాళికల రచన కొరకు ఉద్దేశించిన పథకాల అమలులో స్వయం పరిపాలన సంస్థలుగా పనిచేయగలుగుతాయి.
రాజ్యాంగ అమలులోని స్పూర్తిని ప్రతిబింబించే విధంగా ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ చట్టం 1994 చేయబడింది.
భారత ప్రభుత్వం పంచాయితీరాజ్ మంత్రిత్వశాఖ, పంచాయితీరాజ్ సంస్థలకు అధికారాలను బదిలీ చేసే సవివరమైన ప్రణాళిక చేయుటకు 7వ రౌండు టేబుల్ సమావేశం చేసింది.
ఈ చట్ట సవరణ ఆధారంగా ప్రతి గ్రామ పంచాయితీ పరిధిలో పంచాయితీ విద్యా ఉపకమిటీని ఏర్పాటు చేయాలి.
పంచాయితీ విద్యా ఉపకమిటీ ఏర్పాటు
ప్రతి గ్రామ పంచాయితీ పరిధిలోని పంచాయితీ విద్యా ఉపకమిటీని గ్రామ సర్పంచ్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో మహిళ వార్డు సభ్యులతో ఒకరు వైస్ చైర్మెన్ గాను, మరొకరు సభ్యులుగాను మరియు షెడ్యుల్డ్ కులాలు / తెగలు లేదా వెనుకబడిన తరగతులకు సంబంధించిన ఇద్దరు వార్డు సభ్యులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
ఉపకమిటీ విధులు :
గ్రామ పంచాయితీ పరిధిలోని అన్ని పాఠశాలల పనితీరు
పాఠశాల సిబ్బంది రోజు వారి హాజరు
పిల్లల విద్యా ప్రమాణాలు
పాఠశాల మౌళిక సదుపాయాలు
మధ్యాహ్న భోజనం పథకం సక్రమ అమలు మొదలగు వాటిని పర్యవేక్షించే అధికారం కలిగి ఉంటుంది.
సమావేశాల నిర్వహణ
ఉపకమిటీ ప్రతి శనివారం, ఒకవేళ శనివారం సెలవుదినమైతే ఆ ముందు రోజు సమావేశం నిర్వహిస్తుంది. సమావేశానికి గ్రామ పంచాయితీ పరిధిలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఇద్దరు లేదా ముగ్గురు సీనియర్ ఉపాధ్యాయులు పాల్గొంటారు.
చర్చించే అంశాలు :
ఉపాధ్యాయుల హాజరు
పిల్లల నమోదు మరియు గైర్హాజరు
మధ్యలో బడిమానిన పిల్లల వివరాలు మరియు కారణాలు
పాఠశాలకు అవసరమగు స్వల్ప మరమ్మత్తులు
పై అంశాలకు సంబంధించిన గ్రామ పంచాయితీ అందించే సహాయం తదితర విషయాలను ఉపకమిటీ చర్చిస్తుంది.
అలాగే ఈ దిగువ తెలిపిన విషయాలను కూడా తనిఖీ చేసే అథారిటీని కలిగి ఉంటుంది.
ఉపాధ్యాయులు బడి వేళలు పాటించేలా చూడటం
పాఠశాలలో అమలవుతున్న కార్యక్రమాల తీరు పర్యవేక్షించడం.
మధ్యాహ్న భోజనం నాణ్యతను తెలుసుకోవడం.
పాఠ్యపుస్తకాల సరఫరాలను పరిశీలించడం.
పాఠశాల ఫర్నీచర్, లైబ్రరీ పుస్తకాలు, ప్రయోగశాలలు ఎక్విప్ మెంట్ సరిగా ఉన్నదీ లేనిదీ సరిచూసి నివేదికలను ఉన్నతాధాకారుల దృష్టికి తీసుకెళ్ళడం.
ఉన్నత పాఠశాలలైతే అందులో చడివే 10 వ తరగతి విద్యార్థులకు నిర్వహించే ప్రత్యేక తరగతుల నిర్వహణకు అవసరమైన లైటింగ్, అల్పాహారం తదితర ఏర్పాట్లను గ్రామ పంచాయితీ సహకారంతో సమకూర్చడం.
. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఫ్లాగ్లిప్ ప్రోగ్రామ్ చేపట్టి, మూడు దశల్లో మూడేళ్ళ వ్యవధిలో విద్యా శాఖ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచాలి.
2. ప్రభుత్వ, స్థానిక సంస్థలకు చెందిన పాఠశాలల్లో ముందుగా కార్యక్రమాన్ని అమలుచేసి, ఈ కార్యక్రమం కింద నీటి సౌకర్యంతో కూడిన టాయిలెట్లు, విద్యుదీకరణ, తాగునీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బందికి సరిపడే ఫర్నిచర్, పాఠశాల మొత్తం పెయింటింగ్ వేయడం, పెద్ద, చిన్న మరమ్మతులు, గ్రీన్ చాక్ బోర్డులు, ప్రహరీ గోడలు, కిచెన్ షెడ్లు, శిథిలమైన గదుల స్థానంలో కొత్త క్లాస్ రూంలు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాల్స్, డిజిటల్ విద్య అమలు మొదలైనవి అమలుపరచాలి.
3. ఎంపిక చేసిన పాఠశాలల్లో పనుల మంజూరు బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించబడుతాయి.
4. ఈ పథకాన్ని ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకంగా, అన్ని పనులను వేగంగా అమలు చేయడంకోసం పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్ఎంసీ) లకు బాధ్యతలు అప్పగించబడుతాయి. అభివృద్ధి సంఘాలలో ఇద్దరు క్రియాశీల పూర్వ విద్యార్థులు, ఇద్దరు ఎస్ఎంసీ సభ్యులు, గ్రామ సర్పంచ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సభ్యులుగా ఉంటారు.
5. ప్రతి పాఠశాలకు పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటు చేసి పాత విద్యార్థులను తమ పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములను చేయనున్నారు.
1. పాఠశాలలు అందుబాటు:
2. ఉపాధ్యాయులు
3. అదనపు తరగతి గదులు :
4. మరుగుదొడ్లు:
5. త్రాగునీటి సౌకర్యం
6. విద్యుత్తు సౌకర్యం:
7. పాఠశాల భవనాల నిర్వహణ మరియు స్వల్ప
మరమ్మత్తులు:
8 . భారీ మరమ్మత్తులు: 9. పాఠశాల గ్రాంటు :
10 . నూతన ప్రాథమిక / ప్రాథమికకోన్నత పాఠశాలకు
బోధనాభ్యసన పరికరాల గ్రాంటు (టి.ఎల్.ఇ):
ఉపాధ్యాయ గ్రాంటు
12. ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలు :
13. సమాజ సభ్యులకు శిక్షణా కార్యక్రమం:
14. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు :
15. విన్నూత కార్యక్రమాలు :
16. మండల రిసోర్స్ కేంద్రాలు, పాఠశాల సముదాయ
గ్రాటు:
17. బడిబయట పిల్లలకు విద్యావకాశాలు:
18, ఎలిమెంటరీ స్థాయి జాతీయ బాలికల విద్య
కార్యక్రమం (ఎన్.పి.ఇ.జి.ఇ.ఎల్):
19. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు
(కె.జి.బి.వి):
20, యూనిఫామ్స్ :
21. రవాణా సౌకర్యం:
22. రెసిడెన్షియల్ పాఠశాలలు : 5. పాఠశాలలు అందుబాటు
6. బడిఈడు పిల్లల నమోదు మరియు నిలకడ
7. గుణాత్మక విద్య సాధించాలంటే…..?
8. పాఠశాలలకు అందజేసే వివిధ గ్రాంట్లు నిధుల వినియోగం –
ప్రారంభం
విధివిధానాలు
౪ నిధుల సమీకరణ
> పైలట్ ప్రాజెక్ట్ పనులు
ఇంగ్లీషు మీడియంకు ప్రత్యేక చట్టం
౪ తొలి విడత 9,123 పాఠశాలలు ఎంపిక
ప్రజల భాగస్వామ్యం
పాఠశాలలకు రంగులు
పాఠశాలల ప్రారంభం
మూలాలు