ముస్లిం మైనారిటీలకు అండగా నిలబడతా ఎమ్మెల్యే జారే
ఇందూరు వార్త అక్టోబర్30.10.2024
గండుగులపల్లి క్యాంపుకార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో సమస్యలు వివరిస్తూ ప్రభుత్వ సేవలు వినియోగించుకుంటున్న ప్రజలు..
ముస్లిం మైనారిటీలకు అండగా నిలబడతా
ముస్లిం మైనారిటీలు నియోజకవర్గ వ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్యలు అలాగే త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం అందించబోయే ఇందిరమ్మ ఇండ్లలో ముస్లిం మైనారిటీలలో అర్హులైన వారికి లబ్ధి చేకూరేలా చూడాలని ముస్లిం మైనారిటీలకు అన్యాయం జరగకుండా ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని ఎమ్మెల్యే కి మైనారిటీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ సర్ధార్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. ముష్టిబండ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న మసీద్ నిర్మాణానికి సహకరించాలని అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా శిదిళావస్థలో ఉన్న మసీద్ లు షాదీఖానాలు అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే ని కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లిం మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తానని మైనారిటీల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అలాగే ముష్టిబండలో నూతనంగా నిర్మించే మసీదు నిర్మాణానికి సహకరిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట నియోజకవర్గ మైనారిటీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ సర్దార్ , జిల్లా నాయకులు షేక్ గఫార్ , దస్తగీర్ , జానీ మియా హబీబ్ ఎన్ ఎస్ యు ఐ నాయకులు షేక్ బాజీ బాబు తదితరులు పాల్గొన్నారు…