ముదిరాజ్ భవన నిర్మాణం కొరకు అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కి వినతి పత్రం అందజేత
ఇందూరు వార్త:
అందోల్ డిసెంబర్ 30
మెదక్ జిల్లాలోని టేక్మాల్ మండల పరిధిలో ఉన్న బొడ్మట్ పల్లి గ్రామంనికి చెందిన ముదిరాజ్ సంఘం సభ్యులు, మత్స్య సహకార సంఘం సభ్యులతోపాటు అధ్యక్షులు నేడు వారి సమస్యలపై ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ స్వగృహమైన పోతులబోగుడ గ్రామంలో కలసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ముదిరాజ్ సంఘ భవన నిర్మాణం, ప్రహరీ గోడ నిర్మాణానికి ఏర్పాటు చేయుటకు గురించి శాసనసభ సభ్యులు కలవడం జరిగింది అందోల్ శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్ సానుకూలంగా స్పందిస్తూ వెంటనే భవన నిర్మాణానికి మరియుప్రవారీగోడ నిర్మాణం త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది .ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ స్వరూప దశరథ్ గౌడ్ ,BRS పార్టీ గ్రామ అధ్యక్షులు గటంగారి ఈశ్వరప్ప మరియు మండల ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ , ముదిరాజ్ సంఘం అధ్యక్షులు ఉత్తులూరి నరసింహులు మరియు మత్స్య సహకార సంఘం అధ్యక్షులు భవాని అంజయ్య మస్సాక్ సహకార సంఘం ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రవీణ్, అందోల్ విట్టల్ తలుపులూరి నర్సింలు భవాని సాయిబాబా కాసాల కృష్ణయ్య గడ్డం రామయ్య, గడ్డం పండరి అందోల్ శీను, గడ్డం గోపాల్, తదితరులు పాల్గొన్నారు.