*ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేసిన*
*-సర్పంచ్ భాగ్యమ్మ..*
*-ఎక్స్ ఎంపీపీ వై. రజనీకాంత్ రెడ్డి…*
ఇందూర్ వార్త జుక్కల్ నియోజకవర్గం ప్రతినిధి : ఫిబ్రవరి 05
కామారెడ్డి జిల్లా : పిట్లం మండలం బండపల్లి గ్రామంలో ఆదివారం నాడు ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయనిధి వరం లాంటిదని సర్పంచ్ భాగ్యమ్మ , ఎక్స్ ఎంపీపీ వై. రజనీకాంత్ రెడ్డి అన్నారు. పిట్లం మండలంలో బండపల్లి గ్రామానికి చెందినటువంటి లబ్ధిదారులకు చెక్కును అందించడం జరిగింది. కుమ్మరి రూక్కవ / బాలయ్య కు 58000 రూపాయలు చెక్కును ఇవ్వడం జరిగింది వై రజినీకాంత్ రెడ్డి మాట్లాడుతూ…. ఆర్థిక స్తోమత లేక అనారోగ్యాల బారిన పడుతున్న పేదలకు సీఎం సహాయ నిధి కార్పొరేట్ వైద్యంతో స్వస్థత పొందేందుకు ఎంతగానో దోహదపడుతుందన్నారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం సహాయ నిధి కింద దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి సీఎం సహాయనిది చెక్కు అందివ్వడం జరుగుతుందని అన్నారు. మరియు గుల నడిపి సంఘ బోయ్/- ఆగబోయి కి హార్ట్ పే సెట్ అయినటువంటి విషయం తెలుసుకొని ఇంటికి వెళ్లి ప్రతి టాబ్లెట్స్ మందులను పరిశీలించి టైం టు టైం వేసుకోవాలని ఎల్లవేళలా నేను ఉంటానని ధైర్యం ఇస్తూ పరామర్శించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు సొసైటీ వైస్ ప్రెసిడెంట్ పి రాములు , ఉప సర్పంచ్ రాజు , చిన్న బాపి రెడ్డి , లక్ష్మణ్ , సాయిలు , శ్రీకాంత్ , తుకారం , నాగనాథ్ , బుర్ర నాయక్ , బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు , పాల్గొనడం జరిగింది.