మీడియా పై మోహన్ బాబు చేసిన దాడిని ఖండించిన దమ్మపేట స్వేచ్ఛా ప్రెస్ క్లబ్
ఇందూర్ వార్త డిసెంబర్ 11 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో సినీ నటుడు మంచు మోహన్ బాబు మీడియా పై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తు స్వేచ్చా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు,రిపోర్టర్ తంబళ్ల రవిమాట్లాడుతూ మీడియా పై దాడి చేసిన మోహన్ బాబు పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని,అలాగే జర్నలిస్ట్‌లకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలనీ,సినీ నటుడు మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దుర్భాషలాడుతూ దాడి చేయడం సరికాదన్నారు ఇటువంటి చెర్యలు ఎంతటి వారు చేసిన క్షమించేది లేదు,వెంటనే మంచు మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు,ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు గంగాధర్ శ్రీను,కారం నాగేంద్ర,తంబల్ల రవి తదితరులు పాల్గొన్నారు.