మనవడు ఇచ్చిన మాటను నెరవేర్చిన తాత
ఇందూరు వార్తా ప్రతినిధి రాజేశ్వరి దమ్మపేట
మనవడు చెప్పడంతో గిరిజన గూడెంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన మంత్రి
2024 సంవత్సరం మార్చి నెలలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మనవడు తుమ్మల యుగంధర్ తనయుడు తుమ్మల ప్రయాగ్ దమ్మపేట మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలోని గ్రామాలైన పూసుకుంట, కట్కూర్ గ్రామాల్లో పర్యటించి గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నాడు…
స్థానిక గిరిజనులు వారు పడుతున్న ఇబ్బందులను మంత్రి మనవడి దృష్టికి తీసుకురావడంతో చలించిపోయిన ప్రయాగ్…
మా తాతకి చెప్పి అభివృద్ది పనులు చేపిస్తానని హామీ…
గిరిజనుల సమస్యలు విన్న మనవడు తాతతో చెప్పడంతో పనులు పనులు చకచకా ప్రారంభం…
మంత్రి మనవడు గిరిజనుల సమస్యలు విని చలించి గిరిజనుల పట్ల అభిమానంతో తాతతో చెప్పి అభివృద్ధి పనులు ప్రారంభమయ్యేలా చేయడంతో ప్రయాగ్ ప్రయత్నం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న గిరిజనులు.