ఆరేపల్లి గ్రామంలో మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం
ఇందూర్ వార్త :
రాజంపేట, ఫిబ్రవరి 10,
రాజంపేట మండలంలోని ఆరేపల్లి గ్రామంలో మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం 11-02-2023 నుండి 13-02-2023 వరకు జరుగును.11 వ తేది శనివారం రోజున గంగా భోనము,12 వ తేదీన గంపలు వెళ్ళుట,13 వ తేదీన కన్నుల పండుగగా మలన్న కళ్యాణము, అన్నదాన కార్యక్రమం జరుగును.కావున పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని కళ్యాణ మహోత్సవం తిలకించాలని యాదవ యువజన సంఘ సభ్యులు కిషోర్ యాదవ్,శ్రీకాంత్ యాదవ్,అనిల్ యాదవ్,హరిష్ యాదవ్,అనిల్ యాదవ్, ప్రశాంత్ యాదవ్,గణేష్ యాదవ్, కోరుతున్నారు