మద్దిశెట్టి కి గౌరవ డాక్టరేట్
ఇందూర్ వార్త డిసెంబర్ 10 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్న మద్దిశెట్టి సామేలు. గత 23 ఏళ్లుగా ప్రజా సేవకు తన జీవితాన్ని అర్పించి, పేద ప్రజల హక్కుల కోసం వారి జీవితాల అభివృద్ధి, మహిళల పురోగతి కోసం నిరంతరం శ్రమిస్తు, 5 జిల్లాల్లో 600 గ్రామాల్లో ప్రజాదరణ పొంది కరోనా కష్ట సమయంలో ఒక పక్క ప్రజాహక్కుల కోసం కృషి చేస్తూనే తన వంతుగా రేషన్, నిత్యావసర సరుకులు అందిస్తూ తన ప్రజలకు ఏ కష్టం రాకుండా చూసుకున్న మద్దిశెట్టి సామేలు ని యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ని ప్రదానం చేశారు.మద్దిశెట్టి మాట్లాడుతూ నేను చేస్తున్న ప్రజా సేవను గుర్తించి నాకు డాక్టరేట్ ఇచ్చిన యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీకి మరియు నాకు డాక్టరేట్ రావడానికి సహకరించిన ప్రతి ఒకరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.