మణుగూరు ఏరియా సింగరేణి వైద్యశాల ప్రసూతి వైద్య నిపుణురాలిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ జె. మౌనిక
ఇందూర్ వార్త నవంబర్ 14ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతి నిధి ఆర్ పోలయ్య
హర్షం వ్యక్తం చేసిన సింగరేణి ఉద్యోగులు
ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం పట్ల సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సి ఎం ఓ) కి కృతజ్ఞతలు తెలిపిన
సామాజిక సేవకులు కర్నె బాబురావు
మణుగూరు ఏరియా సింగరేణి కార్మికుల తరపున తమ అభ్యర్థనను మన్నించి మణుగూరు ఏరియా సింగరేణి ఆసుపత్రిలో ప్రతి గురువారం సింగరేణి ఉద్యోగుల కుటుంబాలకు చెందిన గర్భిణీ స్త్రీలకు వైద్య సేవలు అందించేందుకు అందుబాటులో ఉండే విధంగా డిప్యూటేషన్ పై ప్రసూతి వైద్య నిపుణురాలిని బాలల దినోత్సవం రోజున నియమించడం పట్ల ప్రముఖ సామాజిక సేవకులు కర్నె బాబురావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ పి. సుజాత కి పత్రికా ముఖంగా కృతజ్ఞతలు తెలిపారు. తమ అభ్యర్థన మన్నించి ఇచ్చిన మాట ప్రకారం మరుసటి రోజే మణుగూరు ఏరియా హాస్పిటల్ లో డిప్యూటేషన్ పై జె. మౌనిక ని నేను నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఉదయం సింగరేణి ఏరియా హాస్పిటల్ లో ప్రసూతి వైద్య నిపుణురాలిగా బాధ్యతలు చేపట్టిన జే. మౌనిక ని అక్కడికి వైద్యానికి వచ్చిన మరికొందరితో కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. గర్భిణీల మనసు గెలుచుకునేలా వైద్య సేవలు అందించాలని ఆయన కోరారు. ఏరియా హాస్పిటల్ ఉప ముఖ్య వైద్యాధికారిని మేరీ కుమారి కి వైద్యులు డాక్టర్ శేషగిరిరావుకి సురేష్ కి , వెంకట రమణయ్య కి కూడా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు గర్భిణీ మహిళలు కూడా పాల్గొన్నారు.