మణుగూరు ఏజెన్సీ పరిధిలో ప్రైవేట్ పాఠశాలల డ్రైవర్లకు, క్లీనర్లకు చట్ట బద్ద హక్కులు అమలు చేయాలి
ఇందూరు వార్త నవంబర్ 16 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
మండల విద్యాధికారిణి స్వర్ణ జ్యోతి మరియు కార్మిక శాఖ అధికారి బి నాగరాజు లకు వినతి పత్రాలు అందజేసిన సామాజిక సేవకులు
మణుగూరు ఏజెన్సీ పరిధిలో ప్రైవేట్ పాఠశాలల డ్రైవర్లకు, క్లీనర్లకు చట్ట బద్ద హక్కులు అమలు చేయాలనీ కోరుతూ శనివారం నాడు మణుగూరు
మండల విద్యాధికారిణి స్వర్ణ జ్యోతి మరియు కార్మిక శాఖ అధికారి బి. నాగరాజు లకు వినతి పత్రాలు అందజేసినట్లు సామాజిక సేవకులు కర్నె బాబురావు విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణుగూరు ఏజెన్సీ పరిధిలోని ప్రైవేటు పాఠశాలల్లో స్కూల్ బస్సులపై పనిచేస్తున్న డ్రైవర్లకు క్లీనర్లకు చట్టబద్ధ హక్కులు అమలు కావడం లేదనీ. వీరికి తప్పనిసరిగా అమలు చేయాల్సిన ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కూడా అమలు కావడం లేదన్నారు. కార్మిక చట్టాల ప్రకారం ప్రతి డ్రైవర్ కి నెలకు ఇరవై ఆరు రోజులు వర్కింగ్ డేస్ (పని దినాలు) నాలుగు రోజులు వారాంతపు సెలవు ఇవ్వాలి కానీ ఈ ప్రవేట్ స్కూల్ యాజమాన్యాలు వారాంతపు సెలవు రోజులలో కూడా బస్సులు నడుపుతూ వీరితో పనిచేయించుకుంటున్న పరిస్థితి ఉన్నదనీ.ఈ విషయంపై ఇరు శాఖ అధికారులు తక్షణమే స్పందించి డ్రైవర్లకు, క్లీనర్లకు చట్టబద్ధమైన హక్కులు అమలు చేయాలని న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని అధికారులను కోరినట్లు ఆయన తెలిపారు.