సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన అంకత ఉమామహేశ్వరరావు
ఇందూర్ వార్త జనవరి14 ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో
మకర సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు. తెలుగు వారికి విశిష్టమైన ఈ సంక్రాంతి పండుగ మీ జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాడిపంటలతో విరాజిల్లే పల్లె సీమలు మరింత కళకళలాడాలని, ఆధునికతను సంతరించుకున్నా మరచిపోని మన సాంప్రదాయాలను ఒడిసిపట్టాలని ఆకాంక్షిస్తున్నాను. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈరోజు శాస్త్రపరంగా అన్ని విధాలుగా ప్రాముఖ్యత కలిగినది. అందుకే మన పెద్దలు చెప్పిన సాంప్రదాయాలను పాటిస్తూ సంక్రాంతిని మరింత ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఉమామహేశ్వరరావు