పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూర్య సీతక్కను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా కొత్తగూడెం పట్టణంలో లైన్స్ క్లబ్ లో మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేేతో స్వాగతం పలికిన డాక్టర్ కొరిపల్లి శ్రీనివాస్ తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు
ఇందూరు వార్త ఖమ్మం భద్రాది జిల్లా బ్యూరో మే 29
తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ఎస్సీ దళిత వాడలనుగ్రామ పంచాయితీలుగా ఏర్పాటు చెయ్యాలని మెమోరాండం ఇచ్చి విజ్ఞప్తి చేసినారు మంత్రి స్పందించి
ముఖ్యమంత్రి దృష్టికు తీసుకు వెళ్తానని తెలిపారు వారికీ కృతజ్ఞతలు తలు తెలిసిన దళిత సంఘాల నాయకులు తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొరిపల్లి శ్రీనివాస్ మాదిగ
బొమెర శ్రీను షెడ్యూల్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు మాట్లాడుతూ దశాబ్దాలుగా దళితులను అధికారానికి దూరంగా విద్య ఉద్యోగ రాజకీయ రంగాలలో వివక్ష చూపిస్తూ అభివృద్ధికి మూసుకొని దళిత వాడలను ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను ఎస్సీ దళితవాడల అభివృద్ధికి ఉపయోగపడేలా భవిష్యత్తు రోజుల్లో దళితవాడలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయటం వలన అభివృద్ధి జరుగుతుందని మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేశారు
ఈకార్యక్రమంలో కుక్క ముడి సంపత్ దేవరకొండ కిరణ్ ఎనగంటి శ్రీనివాస్ రాచమల్ల నరసయ్య ఉండేటి దేవరాజ్ కండె రాములు శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు