మంగళగిరి లింక్ డొంక మరమ్మతులు చేయించండి
ఇందూర్ వార్త నవంబర్ 3 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
బీఎస్పీ నేత తంబర్ల ఎమ్మెల్యేకు వినతి పత్రం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు
జూలూరుపాడు మండల కేంద్రంలో వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే కి మంగళగిరి లింక్ రోడ్డును మరమ్మతులు చేయించండి అంటూ బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు తంబర్ల నరసింహారావు వైరా ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించి అనంతరం వారు మాట్లాడుతూ జూలూరుపాడు మండలంలో అన్నారుపాడు గ్రామపంచాయతీ లో ఉన్న మంగళగిరి లింక్ డొంకకు గత ప్రభుత్వం మంచిగా ఉన్న డొంకను అభివృద్ధి చేస్తానంటూ నల్లటి రేగడ మట్టిని రోడ్డుపై పోయించటం జరిగినది అలా పోయించడం వలన చిన్నపాటి వర్షం వచ్చిన రైతులు ఆ రోడ్డులో నడిచే వీలు లేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కనుక తక్షణమే మంగళగిరి లింకు రోడ్డుకు మరమ్మతులు చేయించండి అంటూ కోరడం జరిగిందని ఆయన అన్నారు