కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలి
ఇందూరు వార్త ఆర్మూర్ ప్రతినిధి ఆగస్ట్03
భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆర్మూర్ ఆర్డీవో ముందు ధర్నా నిర్వహించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని భారత రైతు కూలీ సంఘం. రాష్ట్ర ఉపాధ్యక్షులు బొట్ల రాజు అన్నారు. ముఖ్య ఐఎఫ్టియు రామ్ క స్పందన రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సుధాకర్ లు విధంగా అన్నారు. రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు, ఇల్లు, ఇండ్ల స్థలాలు, అరులైన వారందరికీ ప్రభుత్వ వాగ్దాన ప్రకారం పెన్షన్లు ఇవ్వాలని. రైతాంగ రుణాలను రద్దు చేయాలి. వెంటనే కొత్త రుణాలు ఇవ్వాలని. నిరుద్యోగ ఖాళీలపై శ్వేతపత్రం ప్రకటించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, పోడు సాగుదారులకు పట్టాలి వాళ్ళని హక్కులు కల్పించాలని, వ్యవసాయ కార్మికులకు ప్రకటించిన 12000 రూపాయలు జీవన భృతిని వెంటనే అమలు చేయాలని. భావన నిర్మాణ కార్మికులకు ఇతర అసంఘటిత కాంట్రాక్టు కార్మికులకు సెలవులతో కూడిన కనీస వేతనం అమలు చేయాలని. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ బకాయాలను వెంటనే చెల్లించాలని. ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలాన్ని గృహ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని. బోదకాలు బాధితులకు సదరం సర్టిఫికెట్ ఇచ్చి వికలాంగులుగా గుర్తించి నెలకు పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని తదితరుల డిమాండ్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వ అమలు చేయాలని కోరారు. శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీలకు కాలాన్ని ఇచ్చి ఇప్పటికి 80 సంవత్సరాలు అవుతున్నది అవి శిధిల వ్యవస్థలో ఉన్నవి వాటి స్థానంలో కొత్త ఇండ్లు మంజూరు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలోభారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి సయ్యద్ జిల్లా నాయకులు పేద్దులు బొట్ల గంగారం భారత ప్రగశీల మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు భాను బేగం అరుణ అరుణోదయ సంస్కృత సమైక్య రాష్ట్ర కార్యదర్శి సురేష్ తదితరులు పాల్గొన్నారు.