భవన నిర్మాణ సంక్షేమ బోర్డు పథకాలను భవన నిర్మాణ కార్మికులు వినియోగించుకోవాలి
ఇందూర్ వార్త నవంబర్ 2ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతి నిధి
సిపిఐ అశ్వాపురం మండల కార్యదర్శి అనంతనేని సురేష్,
:అశ్వాపురం, పోరాడి సాధించుకున్న కార్మిక సంక్షేమ పథకాలను భవన నిర్మాణ కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని,
సిపిఐ అశ్వాపురం మండల కార్యదర్శి అనంతనేని సురేష్
కార్మికులను కోరారు శనివారం అశ్వాపురం మండలం యూనియన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ, తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి వస్తున్న సంక్షేమ పథకాలన్నీ నిజమైన కార్మికులకు అందేవిధంగా కృషి చేయాలని,ఇంకా అశ్వాపురం మండలంలో లేబర్ ఇన్సూరెన్స్ చేయించులేకుండా ఉన్న కార్మికులందరూ లేబర్ ఇన్సూరెన్స్ చేయించుకొని సంక్షేమ బోర్డు నుంచి వస్తున్న సంక్షేమ పథకాలను అందుకోవాలని కోరారు. యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులకు లేబర్ ఇన్సూరెన్స్ కార్డులు అందచేశారు.
ఈ కార్యక్రమంలో
బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు, మేలపుర సురేందర్ రెడ్డి, ఏఐటీయూసీ మండల అధ్యక్షులు,రాయపూడి రాజేష్
భవన నిర్మాణ కార్మికుల సంఘం సహాయ కార్యదర్శులు, ఈనపల్లి పవన్ సాయి, ముద్దుశెట్టి నరసింహారావ
అక్కినపల్లి నాగేంద్రబాబు, సప్క పిచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.