భద్రత లేని పామాయిల్ కర్మాగారం
పామాయిల్ కర్మాగారంలో కార్మికులకు అందుబాటులో అంబులెన్స్ మరియు ఒక మెడికల్ ఆఫీసర్ నీ ఏర్పాటు చేయాలి
మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ ఆదివాసీ నాయకులు తంబల్ల రవి
ఇందూరు వార్త నవంబర్ 10 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
శనివారం రాత్రి ఫ్యాక్టరీలో వాహనం తగిలి ఒక కార్మికుడు మృతిపామాయిల్ కర్మాగారంలో కార్మికులకు అందుబాటులో అంబులెన్స్ మరియు ఒక మెడికల్ ఆఫీసర్ నీ ఏర్పాటు చేయాలని ఆదివాసీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేటలో ఉన్న పామాయిల్ ఫ్యాక్టరీలో శనివారం అర్ధరాత్రి ఒక ప్రవేట్ కార్మికుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జీలుగుమిల్లి మండలం అంకంపాలెం గ్రామానికి చెందిన తోట వెంకటేశ్వర్లు (30) వ్యక్తి ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా వాహనం తగిలి కింద పడిపోగా హాస్పిటల్ కి తరలించే క్రమంలో మరణించడం జరిగిందనీ అని సమాచారం,ఫ్యాక్టరీలో పని చేసే కార్మికుల కోసం కనీసం ఒక అంబులెన్స్ లేదు,ఒక మెడికల్ ఆఫీసర్ లేడు,ఏజెన్సీ ప్రాంతం మారుమూల గ్రామాల నుంచి ఎంతోమంది కార్మికులు ఇక్కడికి పనిచేయడం కోసం వస్తూ ఉంటారు మరి వాళ్ళకి కనీస భద్రత కరువైనది, ఫ్యాక్టరీ లోపల సీసీ కెమెరాల పరిరక్షణ లేదు,ఫ్యాక్టరీ లోపల మొత్తం ప్రతి మూల కవర్ అయ్యేలాగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని,ప్రతి కార్మికుడికి రక్షణ కవచాలు ఇవ్వాలనిమృతుని కుటుంబానికి న్యాయం చేయాలని ఆదివాసీ నాయకులు తంబల్ల రవి డిమాండ్ చేశారు.
: