*బీసీ లకు అన్యాయం చేస్తే ఊరుకోము*
బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు ముదిరాజ్
*(ఇందూర్ వార్త):*
కామారెడ్డి,13ఫిబ్రవరి
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని జిల్లా కేంద్రంలోని అంబేద్కర్,జ్యోతి బాపూలే విగ్రహాలకు వినతిపత్రం ఇచ్చి అనంతరం కలెక్టర్ కార్యాలయంలో జరిగే ప్రజావాణి కార్యక్రమంలో జేసి కి వినతి పత్రం ఇచ్చారు.అనంతరం
బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు,సంక్షేమ సంఘం అధ్యక్షులు సాప శివరాములు మాట్లాడుతూ
రెండు లక్షల 90 వేల 396 కోట్ల రాష్ట్ర బడ్జెట్లో
బీసీలకు రెండు శాతం
నిధులా అని ప్రశ్నించారు.6,229 వేల కోట్ల నుండి
50 వేల కోట్లకు పెంచాలి అన్నారు.45 లక్షల కోట్ల కేంద్ర బడ్జేట్లో బిసిలకు రెండు శాతం నిదులా అని, రెండువేల కోట్ల నుండి లక్ష కోట్లకు పెంచాలి అన్నారు.అలాగే దేశ వ్యాప్తంగా జరిగే జాతి
జనగణలో బీసీల కులగణనను వెంటనే
చేపట్టాలి అని,బిహర్ ప్రభుత్వం మాదిరిగా తెలంగాణ రాష్ట్ర
ప్రభుత్వం కూడ రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టాలి అన్నారు.జనాభా దామాషా ప్రకారం
బీసీ రిజర్వేషన్లను
29 శాతం నుండి 50% కు పెంచాలి అన్నారు.బిసీల డిమాండ్లపై ఇటు
అసెంబ్లీలో అటు పార్లమెంటులో తీర్మానం చేయాలి అన్నారు.లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు నీల నాగరాజు ముదిరాజ్,బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సాప శివరాములు,జిల్లా ఉపాధ్యక్షులు మారోజు మోహన చారి,డాక్టర్ సిహెచ్ రాజయ్య,జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దల మహేష్ కుమార్,సహాయ కార్యదర్శి జొన్నల రమేష్,బీసీ సంక్షేమ సంఘం మహిళ అధ్యక్షురాలు ఎం లక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి మంత్రి సుమప్రియ,జిల్లా యూత్ అధ్యక్షులు ఐరేని సందీప్ కుమార్, యూత్ ప్రధాన కార్యదర్శి వడ్ల సురేష్ కుమార్,టౌన్ యూత్ అధ్యక్షులు భరత్ కుమార్,టౌన్ యూత్ ప్రధాన కార్యదర్శి శ్యాంసుందర్,భరత్ భిక్కనూరు మండల అధ్యక్షులు పనస నరసింహులు,ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, తాడ్వాయి మండల అధ్యక్షులు ఎస్ దయాకర్,కామారెడ్డి మండల అధ్యక్షులు జి అంజయ్య,కామారెడ్డి టౌన్ ప్రెసిడెంట్ మాయ ప్రసాద్,కామారెడ్డి ఎల్లారెడ్డి అసెంబ్లీ ఇన్చార్జ్ ఈ నరేందర్, బహుజన నాయకులు కే శ్యామ్ ఎం శంకర్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు.