ఇందూర్ వార్త ప్రతినిధి రాజు
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని B V రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో 3 రోజు జాతీయ ఇంజనీరింగ్ విద్యార్థుల E- విద్యుత్ వాహనాల పోటీలు బాజా సైండియా (e-BAJA SAE INDIA) 2024 యొక్క 17వ ఎడిషన్, విష్ణు మోటార్స్పోర్ట్స్ సహకారంతో నర్సాపూర్ క్యాంపస్లో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను చాలా గ్రాండ్ నిర్వహించారు .
శ్రీ కె.వి. విష్ణు రాజు గారు, శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ (SVES) చైర్మన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వారు మాట్లాడుతూ ఈ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం ఈ రంగంలో మహిళల సంఖ్యను పెంచడం, అవకాశాలను పంచుకోవడానికి మరియు సినర్జీలను అన్వేషించడానికి మరియు వృద్ధికి సాధనాలను అందించడానికి ఒక వేదికను సులభతరం చేయడం అని చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం ఐక్యరాజ్యసమితి యెక్క థీమ్ “’మహిళల్లతో పెట్టుబడులు పెట్టండి: పురోగతిని వేగవంతం చేయండి” (Invest in Women: Accelerate Progress) అనే థీమ్తో ఐక్యరాజ్యసమితి 2024 ని ప్రకటించబడిందని శ్రీ కె.వి. విష్ణు రాజు గారు తెలిపారు. మా ఎడ్యుకేషనల్ సొసైటీ గ్రామీణ ప్రాంతం మరియు పట్టణ ప్రాంతాల కోసం రెండు మహిళా ఇంజనీరింగ్ కళాశాలలను ప్రారంభించిందని చెప్పారు. మా కళాశాలలో మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, బయో మెడికల్ , ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ వివిధ విభాగాలలో అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయని ఇందులో ప్రోత్సాహం కోరకు 110 ఎకరాల విస్తీర్ణంలో గ్రీన్ క్యాంపస్ లో గో-కార్ట్ ట్రాక్ మరియు ఆల్-టెర్రైన్ వాహనాల కోరకు ట్రాక్ నిర్మించామని చెప్పడం జరిగింది.
.ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముఖ్య అతిథులు ఆటోమొబైల్ పరిశ్రమలో అత్యంత నిష్ణాతులైన కొందరు మహిళలు పాల్గొనారు వీరిలో ముంబైకి చెందిన శివాని పర్మార్, బ్రాండ్ స్ట్రాటజిస్ట్ & ఇండియన్ నేషనల్ ర్యాలీ డ్రైవర్, ఖుష్బూ గుప్తా ; హీరో మోటోకార్ప్, శ్రీమతి దీప్తి సింగ్, డిప్యూటీ జనరల్ మేనేజర్, రెనాల్ట్ నిస్సాన్ టెక్, శ్రీమతి గాయత్రి కెంబురు, డిప్యూటీ జనరల్ మేనేజర్, రెనాల్ట్ నిస్సాన్, శ్రీమతి .ఎలంగేశ్వరి, టీమ్ లీడర్, డెట్రాయిట్ ఇంజినీర్డ్ ప్రొడక్ట్స్లో గ్లోబల్ మార్కెటింగ్, చెన్నై, మిస్. గుణ్ణం లాస్య టాటా మోటార్స్ సీనియర్ మేనేజర్, చెన్నైకి, చెందిన వారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
ఈ వేడుకల్లో చలనశీలత (Mobility రంగంలో మహిళలు అనే అంశం పై కార్యక్రమ నిర్వహించబడిందని బాజా సైండియా 2024 ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ సంజయ్ నిబంధే అన్నారు. డా.కె సి వోరా చీఫ్ గ్రోత్ అడ్వైజర్, pManifold evACAD, సలహాదారు, బాజా సైండియా మాట్లాడుత ఆటోమొబైల్ రంగానికి రూపకల్పన మరియు పరిశ్రమను ఆకర్షించడం కోసం మహిళా విద్యార్థులకు బాజా సైండియా ఉద్యోగ అవకాశం లో చాలా సహాయం చేస్తుందని చెప్పారు.
ఖుష్బూ గుప్తా; హీరో మోటోకార్ప్లో బ్యాటరీ సెల్ ఇంజనీర్, ప్రస్తుతం బ్యాటరీ సెల్ డెవలప్మెంట్ ప్రాంతంలో పనిచేస్తున్నారు. లింగ నిష్పత్తితో సంబంధం లేకుండా అగ్ర లక్ష్యాలను చేరడానీకి ఏదైనా అకడమిక్ మరియు ప్రొఫెషనల్ డెవలప్మెంట్లో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఏకాగ్రత ఉండాలి అని చెప్పారు.
శ్రీమతి దీప్తి సింగ్, డిప్యూటీ జనరల్ మేనేజర్, రెనాల్ట్ నిస్సాన్ టెక్, వారు మాట్లాడుతూ న్యాయం, గౌరవం, నమ్మకం, సమానత్వం, సహకారం, ప్రశంస కలిగి మహిళని గౌరవించాలి. వాళ్ళని తక్కువగా చూడడం, కించపరచడం లాంటివి చెయ్యకూడదు. వాళ్ళు కూడా మగవారిలానే చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలా అందరినీ ఒకేలా విలువ కట్టాలి. అంతే కానీ ఒకరిని ఒకలా, మరొకరి ఒకలా చూడడం మానుకోవాలి. సమానమైన గౌరవం ఇవ్వడం సరిగ్గా విలువ కట్టడం లాంటివి పాటించాలి. అది నిజంగా చాల అవసరం అని చెప్పారు.
శ్రీమతి గాయత్రి కెంబురు: రెనాల్ట్ నిస్సాన్కు చెందిన డిప్యూటీ జనరల్ మేనేజర్, రెనాల్ట్ నిస్సాన్ టెక్నాలజీ & బిజినెస్ సెంటర్ ఇండియా వెహికల్ డయాగ్నోస్టిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, టెస్ట్ మరియు మెజర్మెంట్ పరికరాలు, ప్రోటోకాల్స్ సంబదించిన ఆమె ఈ ఈవెంట్పై మాట్లాడుతూ మీరు రేస్ ట్రాక్లో ఉన్నట్లుగా జీవితాన్ని గడపాలని నేను నమ్ముతున్నానని. మీరు మీ రేసింగ్ వీబాగం లో భూభాగం, కారు, ట్రాక్, మూలలు మరియు మీ పరిమితులను ఎలా పెంచుకోవాలో అర్థం చేసుకోవాలని చెప్పారు. శ్రీమతి .ఎలంగేశ్వరి: టీమ్ లీడర్, డెట్రాయిట్ ఇంజినీర్డ్ ప్రొడక్ట్స్లో గ్లోబల్ మార్కెటింగ్, చెన్నై కి చెందిన వారు మాట్లాడుతూ
టాటా మోటార్స్కు చెందిన గుణ్ణం లాస్య మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మార్గ నిర్దేశం చేశారు.
మిస్.. గుణ్ణం లాస్య టాటా మోటార్స్ సీనియర్ మేనేజర్, వారు మాట్లాడుతూ న్యాయం, గౌరవం, నమ్మకం, సమానత్వం, సహకారం, ప్రశంస కలిగి మహిళని గౌరవించాలి. వాళ్ళని తక్కువగా చూడడం, కించపరచడం లాంటివి చెయ్యకూడదు. వాళ్ళు కూడా మగవారిలానే చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలా అందరినీ ఒకేలా విలువ కట్టాలి. అంతే కానీ ఒకరిని ఒకలా, మరొకరి ఒకలా చూడడం మానుకోవాలి. సమానమైన గౌరవం ఇవ్వడం సరిగ్గా విలువ కట్టడం లాంటివి పాటించాలి. అది నిజంగా చాల అవసరం. టాటా మోటార్స్ నందు టెక్నాలజీ లో 100 మంది మహిళలు వర్క్ స్పేస్ కలిగి పనిచేసున్నారు. ఇది చాల గర్వకారణమని చెప్పవచ్చు. బ్రాంచ్ ఏదైనీ చేసే వర్క్ లో తేడా ఇన్నోవేషన్ వుంటె ఆడైన దానిలో రాణించవచ్చునని చెప్పారు
బివిఆర్ఐటి కళాశాలకు చెందిన డాక్టర్ హెచ్ సుజన, బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగం అధిపతి ఉన్నారు, వారు మహిళా సాధికారత గురుంచి మాట్లాడుతూ మనం ఆధునిక చరిత్ర చూసినా ఏమి చూసినా మహిళలు ఎప్పుడూ కూడా మంచి భవిష్యత్తుని కోరుకుంటారు. వాళ్ల కమ్యూనిటీలో, వాళ్ళ పిల్లల్లో మరియు వాళ్ళలో కూడా మంచి భవిష్యత్తును తీసుకు రావడానికి ఎప్పుడూ ముందు ఉంటారు. ప్రపంచం ఛాలెంజ్ తో కూడుకుందని దానిని విశ్వాసంతో ముందుగు వెళ్ళలని చెప్పినారు.
3 రోజు జాతీయ ఇంజనీరింగ్ పోటీలలో:
• అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
• ‘ఆల్-టెర్రైన్ రోడ్ ఎలక్ట్రిక్ బగ్గీస్ ఉమెన్స్ ఎక్స్క్లూజివ్ మినీ-ఎండ్యూరెన్స్ రేస్’
• ప్రతి వెహికల్స్ కి బ్రేక్ పరీక్షలు
• ప్రతి వెహికల్స్ సాంకేతిక మూల్యాంకనం,
• షాక్ అబ్సార్బర్స్ పరీక్షలు,
• డైనమిక్ సంఘటనలు,
• ధ్రువీకరణ ఈవెంట్,
• ఖర్చు ఆర్థిక ఫైనాన్స్
• , డిజైన్ ఈవెంట్ ఫైనల్స్,
• ఇన్నోవేషన్స్,
• ద్రోణాచార్య అవార్డు కార్యక్రమం మొదలైనవి.
ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా ‘ఆల్-టెర్రైన్ రోడ్ ఎలక్ట్రిక్ బగ్గీస్ ఉమెన్స్ ఎక్స్క్లూజివ్ మినీ-ఎండ్యూరెన్స్ రేస్’ మహిళల తో నిర్వహించారు
ఈ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం ఈ రంగంలో మహిళల సంఖ్యను పెంచడం, అవకాశాలను పంచుకోవడానికి మరియు సినర్జీలను అన్వేషించడానికి మరియు వృద్ధికి సాధనాలను అందించడానికి ఒక వేదికను సులభతరం చేయడం.
డాక్టర్ కె సి వోరా, S. బాల్ రాజ్ BAJA, SAEINDIA, డాక్టర్ అరుణ్ జౌరా, హీరో మోటోకార్ప్ కంపెనీ CTO, BAJA, SAEINDIA నిర్వహణ సంఘం, BAJA విద్యార్థులు పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డా.కె.లక్ష్మీప్రసాద్, ప్రిన్సిపాల్ డా.సంజయ్ దూబే, డైరెక్టర్ అఫ్ ఇండస్ట్రీ రిలేషన్స్ డ్ర్.సతీష్ చంద్ర పరుచూరి, డాక్టర్ డి వి రాజు, ప్రోగ్రాం కోఆర్డినేటర్ ,మనోనీత్ కుమార్ సింగ్, మేనేజర్, విష్ణు మోటార్స్పోర్ట్స్, డాక్టర్ శ్రీనివాసరాజు, కాంత రావు,, డీజీఎం ,అన్నిశాఖ విభాగాల అధిపతులు, డా.రాయుడు, డా.మురలి కృష్ణ, డా.మధుబాబు, డా.వరుణ్ డీన్స్, శ్రీ బాపిరాజు, మేనేజర్ ,అశోక్ రెడ్డి, సురేష్ నిర్వాహకులు పాల్గొన్నారు.