అశ్వారావుపేట దళిత సంఘాల ఆధ్వర్యంలో..
బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం ఏర్పాటుకు అశ్వరావుపేట తాసిల్దార్ కి వినతి.
ఇందూరు వార్త ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి డిసెంబర్ 16
అశ్వారావుపేట : భారతదేశానికి అనేక రంగాల్లో విశిష్ట సేవలందించిన భారత జాతీయ నాయకులు బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని అశ్వారావుపేట పట్టణంలో ఏర్పాటు చేయుటకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ అశ్వారావుపేట దళిత సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు వినతిపత్రం అందజేశారు. బాబూ జగ్జీవన్ రామ్ భారతీయ స్వాతంత్ర కార్యకర్తగా, దళితుల సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ స్థాపనలో కీలక పాత్ర పోషించారని, 1979లో భారతదేశ ఉప ప్రధానిగా, కేంద్ర రక్షణ మంత్రిగా, కేంద్ర వ్యవసాయ, నీటి పారుదల శాఖ మంత్రిగా, భారత రాజ్యాంగ సభ్యుడిగా, వివిద శాఖల్లో వివిధ హోదాల్లో భారతదేశ అభివృద్ధి కోసం, దేశ ఔనత్యం కోసం దళితులు సమాన అవకాశాల కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని, వారి కుటుంబం కూడా దేశ సేవలో కీలక పాత్ర పోషించారని, బాబూ జగ్జీవన్ రామ్ కుమార్తె మీరా కుమారి దేశ ప్రధమ పౌరురాలుగా విశిష్ట సేవలు అందించారని, అంతటి మహోన్నత వ్యక్తి బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని అశ్వారావుపేట రింగ్ రోడ్ లో ప్రతిష్టించాలని, అశ్వారావుపేట దళిత సంఘాలు నిర్ణయించడం జరిగిందని, అశ్వారావుపేట పట్టణంలో రోడ్డు వెడల్పు పనులు కొనసాగుచున్నందున విగ్రహం ఏర్పాటు కూడా తేలిక అవుతుందని, కావున అశ్వారావుపేట పట్టణంలో పోలీసు స్టేషను సమీపంలో గల రింగ్ సెంటర్ నందు బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం ఏర్పాటు చేయుటకు అనుమతి ఇవ్వాలని అశ్వరావుపేట తాసిల్దారు గారికి.వినతి పత్రం ఇవ్వడం జరి గింది ఈ కార్యక్రమంలో నార్లపాటి సుబ్బారావు, నార్లపాటి రాములు, తగరం జగన్నాథం, రాయల పోలయ్యతదితరులు పాల్గొన్నారు.