బస్వాపూర్‌లో మెగా ఆయిల్ ఫామ్ సాగుకు నాంది
మొక్కలు నాటిన మంత్రులు తుమ్మల, పొన్నం
ఇందూర్ వార్త జూలై 17
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని బస్వాపూర్ గ్రామంలో మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ కార్యక్రమానికి ఘనంగా శ్రీకారం చుట్టారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు.674 ఎకరాల్లో సాగు, 23 గ్రామాలకు విస్తరణ.ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 143 ప్రాంతాల్లో, 23 గ్రామాలలో కలిపి 674 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేపట్టనున్నారు. ఇందులో బస్వాపూర్ రైతు ఏనుగు రామారావు వ్యవసాయ భూమిలో 50 ఎకరాల్లో సాగు ప్రారంభించారు. ఇప్పటికే ఆయన 30 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారు.కోహెడ మండలంలో 2025–26 ఏడాదికి 359 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యంగా అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
సిద్దిపేటకు రెండో స్థానం
ప్రస్తుతం రాష్ట్రంలో 50,455 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు జరుగుతోంది..సిద్దిపేట జిల్లలొనె 12,242 ఎకరాల్లో 3,747 మంది రైతులు సాగు చేస్తున్నారు. ఖమ్మం తర్వాత అత్యధికంగా ఆయిల్ ఫామ్ సాగు జరుగుతున్న జిల్లా ఇదే….మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ..నాకు ఆయిల్ ఫామ్ పై 30 ఏళ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం 250 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నాను. తెలంగాణను పచ్చదనంతో ముంచెత్తాలంటే ఆయిల్ ఫామ్ వంటి నీటి వినియోగం తక్కువ, ఆదాయం అధికమైన పంటల వైపు రైతులు దృష్టి మళ్ళించాలి.ఒక ఎకరా వరి పంటకు అవసరమైన నీటితో ఐదు ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేయవచ్చు. విద్యుత్, నీటి వినియోగం తగ్గుతుంది. ఆయిల్ ఫ్యాక్టరీ నర్మేటలో నిర్మాణం తుది దశలో ఉంది. ఆగస్టు 15 నాటికి సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తాం.మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..రైతులు మొగ్గు చూపితే ఆయిల్ ఫామ్ సాగుకు పూర్తిగా సహాయపడతాం. పంట ఉత్పత్తైన తర్వాత ఫ్యాక్టరీకి రవాణా ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. వర్షాలు పడకపోయినా, కోతల బెడద లేకుండా ఆయిల్ ఫామ్ పంటలు సాగతీత కలిగిస్తాయి.హుస్నాబాద్ నియోజకవర్గంలో ఒక్క గుంట భూమి కూడా వృథా ఉండకూడదు. రైతులు విస్తృతంగా ఆయిల్ ఫామ్ సాగు చేపట్టాలి.జిల్లా కలెక్టర్ కె. హైమవతి మాట్లాడుతూ.నేను కూడా రైతు కుటుంబానికి చెందినవాణ్ణి. వరి సాగు నీటిని ఎక్కువగా వినియోగిస్తుంది. ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. తక్కువ గ్రౌండ్ వాటర్ ఉన్న ప్రాంతాల్లో ఇది శ్రేయస్కరం.చైర్మన్ జంగా రాఘవ రెడ్డి (ఆయిల్ ఫేడ్ కార్పొరేషన్ మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యంగా పనిచేస్తున్నాం. 300 కోట్ల రూపాయలతో నర్మేటలో ఫ్యాక్టరీ నిర్మిస్తున్నాం. రైతుల వద్ద నుంచే పంట కొనుగోలు చేస్తాం. మార్కెట్ సమస్యలు ఉండవు.4 ఏళ్ల వరకు అంతర పంటల సాగు వీలు రవాణా ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది స్థానికంగా ఫ్యాక్టరీ నిర్మాణం అధిక ఆదాయంతో పాటు నీరు, విద్యుత్ వినియోగంలో తక్కువ వ్యయం జాతీయ స్థాయిలో మార్కెట్‌కి తక్కువ ఆధారపడే విధంగా స్థానిక కొనుగోలు కేంద్రాలు ఇలా సాగుతో పాటు పారిశ్రామిక అభివృద్ధికీ దారితీస్తున్న ఆయిల్ ఫామ్ విస్తరణతో హుస్నాబాద్ త్వరలోనే రాష్ట్రానికి ఆయిల్ హబ్‌గా మారనున్నది.