బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయనికి సన్మానం..
పెద్ద కొడపగల్ ఇందూర్ వార్తా :
వడ్లం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలాలో విధులు నిర్వహించి ఇటీవల బదిలీపై వెళ్లిన రామాంజనేయులను ఉపాధ్యాయులు,విద్యార్థులు గ్రామస్థులు ఘనంగా సన్మానించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ రామాంజనేయులు గత కొన్ని సంవత్సరాలుగా ఈ పాఠశాలలో పని చేసి బదిలీపై వెళ్తునందుకు ఒక వైపు ఆనందం మరో వైపు బాధ ఉన్నపటికీ ఉద్యోగ రీత్యా బదిలిలో వెళ్లడం సహజం అని అన్నారు.విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పినట్లు విద్య బోధనలు పాటిస్తూ మీ తల్లిదండ్రులతో పాటు పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వల్లభరావు, ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామస్థులు పాల్గొన్నారు.