ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో ని జాతీయ రహదారి పైన అరుదైన చిత్రం ప్రయాణికులతో రద్దీగా మారుతున్న ఆర్టీసీ
మొన్నటిదాకా ఖాళీగా కనిపించిన ఆర్టీసీ బస్సు లు.. ‘మహాలక్ష్మి’ ఎఫెక్ట్ కిక్కిరిసిపోతున్నాయి. దీంతో కాలేజీకి వెళ్లే విద్యార్థు లకు సీటు కాదు కదా.. బస్సులో నిల్చుండే జాగ కూడా దొరకడం లేదు. మంగళవారం ఉదయం జేబీఎస్ నుండి మెదక్ వెళుతున్న ఆర్టీసీ బస్సు లో ఫుట్ బోర్డు నిల్చొని పలువురు విద్యార్థులు ప్రయాణికులు ప్రయాణం చేస్తున్న దృశ్యమే అందుకు నిదర్శనం. బస్సు మొత్తం మహిళలతోనే నిండిపోవడం.. అదే ఉదయం సమయంలో కాలేజీ విద్యార్థులు ఇతర జాబ్స్ కు సంబంధించిన ప్రయాణికులు కావడంతో ఆ జిల్లాలో వివిధ గ్రామాల విద్యార్థులు. ప్రమాదమని తెలిసినా.. చేసేదేం లేక ఇలా వెళ్లారు. ఆర్టీసీ అధికారులు ప్రయాణిలకుల రద్దీని దృష్టిలో అదనపు బస్సులు నడపాలని కోరుతున్నారు