48 గంటల్లో ప్రభుత్వ యంత్రాంగం మరియు ఆర్టీసీ యాజమాన్య స్పందించాలి లేకపోతే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధం
ఇందూరు వార్త ఖమ్మం భద్రాది జిల్లా బ్యూరో జూలై 13
దమ్మపేట ఆర్టీసీ బస్టాండ్ పరిరక్షణకై ఆమరణ నిరాహార దీక్ష…
48 గంటలలో ప్రభుత్వ యంత్రాంగం మరియు ఆర్టిసి యాజమాన్యం స్పందించాలి
స్పందించకుంటే జులై 15th మంగళవారం ఉదయం నుంచి ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధం…..
దమ్మపేట ఆర్టీసీ బస్టాండ్ పరిరక్షణ కమిటీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో బస్టాండ్ ప్రాంగణంలో పెట్రోల్ బంక్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్థులు 14 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఏ ఒక్క అధికారికి స్పందన లేదు,బస్టాండ్ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం అని ప్రభుత్వ యంత్రాంగం మరియు ఆర్టీసీ యాజమాన్యం 48 గంటలలో స్పందించకుంటే జులై 15th మంగళవారం ఉదయం నుంచి ఆమరణ నిరాహార దీక్ష కు కూర్చుంటాం అని బస్టాండ్ పరిరక్షణ కమిటీ సభ్యులు తెలిపారు.14 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తున్న అధికారులకు ఎందుకు స్పందన లేదు …?బస్టాండ్ లో నిర్మించే పెట్రోల్ బంక్ నీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి,ప్రజలకు అనుకూలంగా బస్టాండ్ ని అభివృద్ధి చేయాలి,మా ప్రాణం పోయినా సరే ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేదే లేదు.