ఇబ్రహీంపేట్లో ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఎంపీపీ
బాన్సువాడ మండలం పరిధిలోని ఇబ్రహీంపేట్ గ్రామంలో నీ ప్రథమీక పాటశాల, అంగన్వాడీ కేంద్రంను అదేవిధంగా సోమేశ్వర్ గ్రామం లోని అంగన్వాడీ కేంద్రం ను ఆకస్మికంగా తనికి చేసిన బాన్సువాడ ఎంపిపి శ్రీమతి దొడ్ల నీరజా వెంకట్రామిరెడ్డి గారు. ఈ సందర్భంగా విద్యార్థులకు భోజనం వసతి గురించి సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు స్వయంగా ఎంపిపి గారు వడ్డించారు, అదేవిధంగా అక్కడి రికార్డ్ లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు ఇబ్రహీంపేట్ గ్రామ సర్పంచ్ నారాయణరెడ్డి, సోమేశ్వర్ గ్రామ సర్పంచ్ శ్రీమతి పద్మ మోగులయ్య, సీనియర్ నాయకులు సాయి రెడ్డి, ఆయ గ్రామ పంచాయితీల కార్యదర్శిలు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.