ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కీచక అధ్యాపకులు
గంభీరావుపేట సెప్టెంబర్ 20 ఇందూర్ వార్త ప్రతినిధి
గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న భౌతిక శాస్త్ర, ఇంగ్లీష్ అధ్యాపకులు విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండి విద్యాబుద్ధులు నేర్పాల్సిన అధ్యాపకులు సమాజం తలదించుకునేలా విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు.
విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం శుక్రవారం వెలుగులోకి వచ్చింది, గత కొంతకాలంగా విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు మొబైల్ ఫోన్లో అసభ్యకరమైన మెసేజ్ లు పంపించడం, విద్యార్థిని లు తల్లిదండ్రులకు తెలపడంతో తల్లిదండ్రులు కళాశాలకు వెళ్లి అధ్యాపకులను నిలదీశారు, అధ్యాపక వృత్తిలో ఉండిఇలాంటి కార్యక్రమాల కు పాల్పడటం ఏమిటి అని మందలించారు, ఇకముందు అలాంటివి జరగవని అధ్యాపకులు తల్లిదండ్రులను క్షమాపణ కోరారు. విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన మాటవాస్తవమేఅనితప్పు,ఒప్పుకోవడంతోఇకముందు ఎటువంటి తప్పు జరిగిన, తాము పూర్తి బాధ్యత వహిస్తామని తల్లిదండ్రులతో రాతపూర్వకంగా అధ్యాపకులు విద్యార్థినుల తల్లిదండ్రులకు వ్రాసి ఇచ్చారు.