ప్రజల జీవితాల్లో ఈ సంక్రాంతి సుఖసంతోషాలు నింపాలి
– సిద్దిపేట్ జిల్లా మానవ హక్కుల సంఘము అధ్యక్షుడు ఇన్యాలపు హరికృష్ణ
– సంక్రాంతి, భోగి,కనుమ శుభాకాంక్షలు తెలిపారు
సిద్దిపేట జిల్లా ప్రతినిధి/ఇందూరు వార్త/జనవరి 12:-
సంక్రాంతి పండుగ సుఖసంతోషాలను నింపాలని
సిద్దిపేట్ జిల్లా మానవ హక్కుల సంఘము అధ్యక్షుడు ఇన్యాలపు హరికృష్ణ సిద్దిపేట్ ప్రజలకు భోగి ,మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగి పండగ సందర్భంగా వేసే భోగి మంటలు అందరి జీవితాల్లో భోగ భాగ్యాలు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకున్నారు. మకర రాశిలోకి సూర్యుడి ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలమని ప్రజల జీవితాల్లో ఈ సంక్రాంతి పండుగ సుఖసంతోషాలను నింపాలని ఆకాంక్షించారు. ప్రజలు సిరి సంపదలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. పండగ పూట పిల్లలు పతంగులు ఎగురవేసే సమయంలో పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు….