కామారెడ్డి జిల్లా కేంద్రంలో
బీసీ విద్యార్థి,యువజన,సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో పొరుయాత్ర వాల్ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు,సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సాప శివరాములు మాట్లాడుతూ చదువు కోసం సామాజిక న్యాయ సాధన కోసం పాలమూరు నుండి పట్నం వరకు 33 జిల్లాల్లో 80 నియోజకవర్గాల్లో డిసెంబర్ 2 నుండి జనవరి 8 వరకు బీసీ విద్యార్థి, యువజన పోరు యాత్ర లో భాగంగా ఈ నెల 19(సోమవారం) రోజున కామారెడ్డి జిల్లాకు వస్తున్నందున జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో మధ్యాహ్నం 2 గంటలకు సభ నిర్వహించడం జరుగుతుంది.ఈ సభకు ముఖ్య అతిథిగా బీసీ జాతీయ అధ్యక్షుడు జాజాల శ్రీనివాస్ గౌడ్,విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్,కేంద్ర కమిటీ అధ్యక్షలు విక్రమ్,యువజన సంఘం అధ్యక్షులు శ్యామ్ హాజరవుతారు.
జిల్లాలోని బీసీ విద్యార్థి,యువజన సంఘాల ప్రజలు పెదశ ఎత్తున సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు,సంక్షేమ సంఘం అధ్యక్షులు సాప శివరాములు,ప్రధాన కార్యదర్శి కుంబాల లక్ష్మణ్ యాదవ్,మహేష్,ఉపాధ్యక్షులు మోహణాచారి,సన్నీత్,కార్తిక్,అనంత్,శివ,నర్సింలు,నిఖిల్,సిద్ధార్థ,హర్ష తదితరులు పాల్గొన్నారు.