ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
పేరుకే ఆధునిక వ్యవసాయ మార్కెట్ గోదాము
1 కనీస వసతులు లేకపోవడం గమనార్హం
2 పట్టించుకోని అధికారులు
3 గోదాము చుట్టుపక్కల సిసి రోడ్ లేకపోవడంతో వాహనాలకు ఇబ్బందిగా మారింది
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి మండలంలోని ఆధునిక వ్యవసాయ మార్కెట్ గోదాము చుట్టుపక్కల సిసి రోడ్ లేకపోవడంతో వాహనాలు లోడింగ్ తో వచ్చి అక్కడే ఇరుక్కుపోతున్నాయి. వర్షాకాల సమయంలో నీరు చేరడంతో గుంతలు ఏర్పడి అదే గుంతల్లో వాహనాలు ఇరుక్కపోతున్నాయి దీనివల్ల లారీ డ్రైవర్ కి దగ్గరిలో ఆహార వసతి కూడా లేకపోవడం విడ్డూరం లారీలు వచ్చి రెండు మూడు రోజులు వేచి ఉండాల్సి వస్తుంది. దీనిపై ఉన్నత అధికారులు స్పందించి గోదాము చుట్టుపక్కల మరమ్మత్తులు చేయించాలి